https://oktelugu.com/

నడిరోడ్డుపై కత్తులతో యువకుల హల్‌చల్

లాక్ డౌన్ వేళ బయటికి తిరుగొద్దని వారించిన వృద్ధురాలిని కొందరు యువకులు కత్తులతో దాడిచేసిన గాయపడిన సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. లాక్ డౌన్ సమయంలో యువకులు రోడ్లపై కత్తులతో తిరగడటంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈసంఘటన స్థానికంగా సంచలనం మారింది. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం దగ్గర ఓ వృద్ధురాలు షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈక్రమంలో రోడ్లపై ఆరుగురు యువకులు తిరుగుతూ కన్పించారు. లాక్ డౌన్ వేళ బయట తిరగడంపై ఆమె వారిని ప్రశ్నించింది. ఇళ్లకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 16, 2020 1:39 pm
    Follow us on


    లాక్ డౌన్ వేళ బయటికి తిరుగొద్దని వారించిన వృద్ధురాలిని కొందరు యువకులు కత్తులతో దాడిచేసిన గాయపడిన సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. లాక్ డౌన్ సమయంలో యువకులు రోడ్లపై కత్తులతో తిరగడటంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈసంఘటన స్థానికంగా సంచలనం మారింది.

    తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం దగ్గర ఓ వృద్ధురాలు షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈక్రమంలో రోడ్లపై ఆరుగురు యువకులు తిరుగుతూ కన్పించారు. లాక్ డౌన్ వేళ బయట తిరగడంపై ఆమె వారిని ప్రశ్నించింది. ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించింది. ఆ యువకులు వృద్ధురాలితో నిర్లక్ష్యంగా మాట్లాడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులకు అక్కడికి చేరుకొని యువకులను మందలించి పంపించారు.

    దీంతో ఆ యువకులు వృద్ధురాలిపై కక్ష్య పెంచుకున్నారు. పోలీసులు వెళ్లిపోయాక ఆ యువకులు తిరిగి ఆ వృద్ధురాలి షాపు వద్దకు వచ్చి సామాన్లను ధ్వంసం చేశారు. వారి వద్ద ఉన్న కత్తులతో దాడి చేస్తుండగా ఆమె కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరిపై ఆ యువకులు దాడి చేసిన అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ దాడిలో వృద్ధురాలు, ఆమె కుమారుడు స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. కాగా యువకులు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేయడం స్థానికంగా సంచలనంగా మారింది.