Tapse: అనెబెల్ సేతుపతి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తాప్సి పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మి రాకెట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి మెప్పించింది. ప్రస్తుతం శభాష్ మిథూ సినిమాలో నటిస్తోంది ఈ భామ. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా తాప్సి తెలిపింది. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా రూపొందిస్తున్నారు.

ఈ క్రమలోనే ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ఉదయం 8 గంటలకు ఓ కల వచ్చింది. క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ కాని ఓ రోజు వస్తుంది. నీలి రంగు దుస్తులతో మహిలలు త్వరలో వస్తారు. మాదీ ఒక క్రికెట్ టీమ్ అవుతుంది. దానికి ఒక గుర్తింపు వస్తుంది. వరల్డ్ కప్ 2022కి సిద్ధంగా ఉండండి అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది తాప్సీ.
కాగా, జెండర్ సమస్యలు ఎదుర్కొనే అథ్లెట్గా రష్మీ రాకెట్లో నటించింది తాప్సీ. ఇప్పుడు మరో స్పోర్ట్స్ జోనర్‌కు చెందిన సినిమాలో నటిస్తుండటం విశేషం. కాగా, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కుతోంది. 2005, 2007 ప్రపంచ కప్ మహిళల క్రికెట్ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించారు. తన కెరీర్లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసిన తర్వాత.. 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.