Homeఎంటర్టైన్మెంట్Dammu Sreeja shocking comments: 'బిగ్ బాస్ 9' కి వెళ్లడమే నేను చేసిన అతిపెద్ద...

Dammu Sreeja shocking comments: ‘బిగ్ బాస్ 9’ కి వెళ్లడమే నేను చేసిన అతిపెద్ద తప్పంటూ దమ్ము శ్రీజ షాకింగ్ కామెంట్స్!

Dammu Sreeja shocking comments: గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరి దమ్ము శ్రీజ. వైజాగ్ ప్రాంతానికి చెందిన ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ‘అగ్ని పరీక్ష’ షోలో ఉన్నప్పుడు ఆడియన్స్ దృష్టిని విశేషంగా ఆకర్షించింది. అలా సామాన్యురాలిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె, కచ్చితంగా గ్రాండ్ ఫినాలే వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ హౌస్ లో మొదటి మూడు వారాలు ఈమె ప్రవర్తన ని చూసిన ఆడియన్స్ చాలా ద్వేషించారు. కానీ తన తప్పులను ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని తనని తానూ మార్చుకోవడం తో మళ్లీ ఈమెపై పాజిటివిటీ ఏర్పడింది. అయితే 5వ వారం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్ చేత అన్యాయం గా ఈమెని ఎలిమినేట్ చేయడాన్ని ఆడియన్స్ అప్పట్లో చాలా తప్పుబట్టారు. ఆమె రీ ఎంట్రీ కోసం గట్టిగా సోషల్ మీడియా లో ప్రతిఘటించారు.

అయితే రీసెంట్ గానే ఆమె తన బిగ్ బాస్ అనుభవాలను ఒక ఇంటర్వ్యూ లో పంచుకుంది. ఆ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో నాపై నెగటివిటీ మామూలు రేంజ్ లో రాలేదు. ముందుగా నేను అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని బలంగా నమ్మే వ్యక్తిని. నాపై మొదటి నుండి నెగిటివిటీ ఉండేది, కానీ పట్టించుకునేదానిని కాదు. నా ముందు ఏదైనా తప్పు జరిగితే దానిని నిలదీసి మాట్లాడకుండా ఉండలేను. అది నా బలహీనత. అలా ఉండడం వల్లే నాపై సోషల్ మీడియా లో ఇంతటి నెగిటివిటీ ఏర్పడింది. బిగ్ బాస్ హౌస్ లో కొన్ని విషయాల్లో మాట్లాడకూడదు అని నాకు అప్పుడే తెలిసి వచ్చింది. ఆ తర్వాత నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయ్యి, రీ ఎంట్రీ ఇవ్వడం పై శ్రీజా మాట్లాడుతూ ‘రీ ఎంట్రీ అవకాశం వచ్చినప్పుడు నేను వద్దని చెప్పాల్సింది. అనవసరంగా వచ్చానని రీ ఎంట్రీ తర్వాత అనిపించింది. బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టం. రెండవసారి అదృష్టం తలుపుతట్టినట్టు అవకాశం వస్తే ఉపయోగించుకోకుండా ఉండలేము కదా, అలా నేను కూడా ఈ షోలో పాల్గొన్నాను. కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులను చూసి అనవసరం గా వచ్చాను అని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియోలో చూసి తెలుసుకోండి.

Bigg Boss 9 SRIJA DAMMU Full Interview - Ep 48 | Telugu Podcast | Kissik Talks | BIG TV Plus

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version