Producer Arrest: చిత్ర పరిశ్రమలో నేరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్, వ్యభిచారం ఇండస్ట్రీలో వేళ్ళూనుకుపోయాయి. ఇప్పటికే పలువురు ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2018లో డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఊపేసింది. పూరి జగన్నాద్, రవితేజ, ఛార్మి, మొమైత్ ఖాన్, రానా తో పాటు పలువురు ప్రముఖులు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. రెండు పర్యాయాలు వీరు ఎన్సీబీ, ఈడీ విచారణ ఎదుర్కొన్నారు.
తాజాగా ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా దొరికాడు. కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్స్ దందా చేస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అటాక్ చేశారు. కృష్ణ ప్రసాద్ చౌదరి ఖమ్మం జిల్లా బోనకల్ కి చెందిన వ్యక్తి. బీటేక్ పూర్తి చేసిన కేసీ చౌదరి నిర్మాతగా పరిశ్రమలో అడుగుపెట్టాడు. పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశాడు. రజినీకాంత్ భారీ బడ్జెట్ మూవీ కబాలి చిత్రాన్ని తెలుగులో విడుదల చేశాడు.
నిర్మాతగా నష్టపోయిన కేపీ చౌదరి డ్రగ్స్ దందాకి అలవాటు పడ్డాడు. గోవాలో పబ్ ఓపెన్ చేసి పరిశ్రమ ప్రముఖులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. ఇక్కడ కూడా కేపీ చౌదరికి నష్టం రావడంతో కొంత కొకైన్ తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. కస్మత్ పూర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద 100 గ్రాముల కొకైన్, రెండు లక్షల నగదు, ఒక కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు.
కేపీ చౌదరి వెనకున్న డ్రగ్ నెట్ వర్క్ ఏమిటో కూపీ లాగనున్నారు. టాలీవుడ్ కి చెందిన నవదీప్, తరుణ్ ఇదే తరహాలో గోవాలో పబ్స్ నడుపుతూ డ్రగ్స్ దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాలీవుడ్ తో పాటు శాండల్ వుడ్ ని డ్రగ్స్ కేసులు ఊపేసాయి.