Idli Kottu Netflix: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ఈ సినిమాపై మొదటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు ఉండేవి. ఆ అంచనాలను కామన్ ఆడియన్స్ లో అందుకోలేకపోయినప్పటికీ, ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం తో కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టై 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజులకు తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) నటించిన ‘ఇడ్లీ కొట్టు'(Idli Kottu Movie) చిత్రం విడుదలైంది. ధనుష్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. తెలుగు లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళం లో మాత్రం కాస్త బెటర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకొని పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.
ఓవరాల్ గా కమర్షియల్ ఫెయిల్యూర్ గానే నిల్చింది ఈ చిత్రం. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకోలేకపోయినప్పటికీ, ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఏ రేంజ్ లో అంటే, ఓజీ చిత్రాన్ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేసేంత. వివరాల్లోకి వెళ్తే ‘ఓజీ’ చిత్రానికి అన్ని భాషలకు కలిపి మొదటి 4 రోజుల్లో 32 లక్షల వ్యూస్ రాగా, 11 రోజులకు కలిపి 53 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కానీ ఇడ్లీ కొట్టు చిత్రానికి కేవలం 5 రోజుల్లోనే 52 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది అనే చెప్పొచ్చు. ఒక ఫ్లాప్ చిత్రానికి, ఇండస్ట్రీ ని షేక్ చేసిన ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ ని డామినేట్ చేయడమా?, ఇదెలా సాధ్యం అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇడ్లీ కొట్టు చిత్రం కేవలం ‘ఓజీ’ ని మాత్రమే డామినేట్ చేయలేదు. ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన అన్ని తమిళ మూవీస్ కంటే ఈ చిత్రానికే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. థియేటర్స్ లో ఈ చిత్రాన్ని ఎవ్వరూ చూడలేదు కాబట్టి, చాలా మందికి అసలు ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది అనే విషయం కూడా తెలియదు కాబట్టి, ఓటీటీ లోకి రాగానే ఇలా ఎగబడి చూస్తున్నారని, అందుకే ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు. ఈమధ్య కాలం లో తమిళం లో సూపర్ హిట్స్ గా నిల్చిన ‘అమరన్’, ‘మహారాజా’ వంటి చిత్రాలు కూడా ఇడ్లీ కొట్టు మేనియా ముందు కొట్టుకుపోయాయి. అయితే థియేటర్స్ లో ఈ చిత్రం ఎందుకు ఆడలేదో తెలియదు కానీ, సినిమా మాత్రం బాగానే ఉంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించబోతుందో చూడాలి.l