https://oktelugu.com/

Ka Collection: ‘దేవర’,’కల్కి’ కి కూడా సాధ్యం కానీ రికార్డుని నెలకొల్పిన కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ..4 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

లాంగ్ రన్ కి సూచిక ఇదే. మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా వివరంగా చూద్దాం. ముందుగా నైజాం ప్రాంతం విషయానికి వస్తే విడుదలకు ముందు ఈ సినిమాకి 3 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కిరణ్ అబ్బవరం రేంజ్ కి ఇది చాలా ఎక్కువే.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 05:32 PM IST

    Ka Collection(1)

    Follow us on

    Ka Collection: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కథ మామూలిదే అయినప్పటికీ దర్శకుడు స్క్రీన్ ప్లే ని నడిపించిన విధానం అద్భుతంగా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని సినిమాలతో పోటీ పడినప్పటికీ దీపావళి విన్నర్ గా నిల్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని చివరి 15 నిమిషాలు బాక్స్ ఆఫీస్ రేంజ్ ని మార్చేసింది అని చెప్పొచ్చు. మొదటి రోజు ఈ సినిమాకి థియేటర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఆడియన్స్ నుండి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ కారణంగా ప్రతీ సెంటర్ లోనూ థియేటర్స్ ని పెంచుకుంటూ వెళ్లారు. మొదటి రోజు 300 థియేటర్స్ లో విడుదలైతే, ఇప్పుడు ఆ సంఖ్య 600 కి చేరింది.

    లాంగ్ రన్ కి సూచిక ఇదే. మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా వివరంగా చూద్దాం. ముందుగా నైజాం ప్రాంతం విషయానికి వస్తే విడుదలకు ముందు ఈ సినిమాకి 3 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కిరణ్ అబ్బవరం రేంజ్ కి ఇది చాలా ఎక్కువే. ఎందుకంటే ఆయన గత రెండు చిత్రాల క్లోజింగ్ కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా కనీసం కోటి రూపాయిల షేర్ ని రాబట్టలేకపోయింది. అలాంటి హీరో సినిమాకి ఇంత రేట్స్ పెట్టి కొనడం సాహసం. కానీ సినిమాలో కంటెంట్ ఉండడం, జనాల్లో పాజిటివ్ మౌత్ టాక్ బలంగా వెళ్లడం తో ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేటితో ఈ చిత్రం లాభాల్లోకి అడుగుపెట్టినట్టే. అదే విధంగా సీడెడ్ కోటి 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో 4 కోట్ల 30 లక్షల రూపాయిలను రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి 4 రోజుల్లో 9 కోట్ల 24 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    మిగిలిన ప్రాంతాలైన ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో మూడు కోట్ల రూపాయిలను రాబట్టాల్సిన అవసరం ఉంది. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాలలో, నాలుగు రోజుల్లోనే 80 శాతం వరకు బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించిందట. ఈ ఏడాది విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేసిన దేవర, కల్కి వంటి చిత్రాలకు కూడా ఇలాంటి అరుదైన రికార్డు లేకపోవడం గమనార్హం. ఫుల్ రన్ లో ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే ఇంకా ఎక్కువే రావొచ్చు.