Homeఎంటర్టైన్మెంట్K-Ramp Movie Review: తాగుబోతు హీరో - మెంటల్ హీరోయిన్ తో ఆడియన్స్ కు K-ర్యాంప్

K-Ramp Movie Review: తాగుబోతు హీరో – మెంటల్ హీరోయిన్ తో ఆడియన్స్ కు K-ర్యాంప్

K-Ramp Movie Review: నటీనటులు: కిరణ్అబ్బవరం, యుక్తి తరేజా, సాయి కుమార్, సీనియర్ నరేష్, మురళిధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు.
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: సతీష్ రెడ్డి
దర్శకత్వం: జైన్స్ నాని

ఈ సినిమా టైటిల్ తోనే అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు మేకర్స్. ఎవరేమనుకున్నా ఫరవాలేదని, సినిమా ప్రేక్షకులలో రిజిస్టర్ కావడం ముఖ్యమనే ఉద్దేశం సినిమా టైటిల్ తోనే స్పష్టమైంది. యువ హీరో కిరణ్ అబ్బవరం ఈ బోల్డ్ టైటిల్ ఉన్న 18 ప్లస్ సెన్సార్ సర్టిఫికేట్ సినిమాతో పెద్దలను మెప్పించాడా లేదా చూద్దాం.

కుమార్ (కిరణ్ అబ్బవరం) పూర్తిగా చెడిపోయిన గొప్పింటి పుత్రరత్నం. తల్లి లేకపోవడంతో తండ్రి అతి గారాబంతో పెంచడమే దానికి కారణం. మన హీరోకు అన్నీ అవలక్షణాలు ఉంటాయి, చదువు అబ్బదు. దీంతో భారీ డొనేషన్ కట్టి కుమార్ ను కేరళ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తాడు. అక్కడి అందమైన లొకేషన్లలో అంతకంటే అందంగా ఉండే మెర్సీ జాయ్(యుక్తి తరేజా) కుమార్ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. మన హీరో భలే భలే అనుకుని ప్రేమించేసి, జీవితాంతం తోడుంటా అంటూ వాగ్దానాలు చేసేసి, ఇటు తన ఇంట్లో అటు అమ్మాయి ఇంట్లో ఒప్పించేసి, ఇక కేరళ కుట్టితో ప్రతిరోజూ పండగే అనుకునే లోపు అమ్మాయికి ఉన్న PTSD(Post-Traumatic Stress Disorder) అనే జబ్బు బైటపడుతుంది. ఎవరైనా తనకు ఒక ప్రామిస్ చేసి అది నిలబెట్టుకోలేకపోయినా, అబద్దం చెప్పినా అల్లకల్లోలం అవుతుంది. మరి ఇలాంటి డైనమైట్ లాంటి అమ్మాయిని లిక్కర్ బాటిల్ లాంటి అబ్బాయి ఎలా హ్యాండిల్ చేశాడు.. చివరికి ఏమైందనేదే మిగతా స్టోరీ.

అసలే రిచ్ ఫ్యామిలీ, పైగా ఒక్కగానొక్క కొడుకు.. దీంతో తాగడం తిరగడం, చదువుని అశ్రద్ద చేయడం అనేది జన్మహక్కు అన్నట్టు ప్రవర్తిస్తుంటాడు హీరోగారు. రిచ్ కిడ్ కాబట్టి రిచ్ గా ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉండడు, చీప్ కిడ్ లాగా కిరణ్ అబ్బవరం ఊర మాసుగా లుంగీ కట్టి జనతా బార్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సినిమామొత్తం తాగడమే అతి పెద్ద పనిగా పెట్టుకుంటాడు. కేరళకు షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇదే వ్యవహారం కంటిన్యూ అవుతుంటుంది. హీరోయిన్ పరిచయం తర్వాత ఇంటర్వెల్ లో తన జబ్బు గురించి తెలిసేవరకూ ఇలానే సాగుతుంది. అప్పటి వరకూ సినిమా సోసో. సెకండ్ హాఫ్ లో అసలు కాన్ ఫ్లిక్ట్ మొదలవుతుంది. హీరోయిన్ వింత ప్రవర్తనతో హీరో పడే ఇబ్బందులు కొంతవరకూ నవ్వించినా ఆ ఎపిసోడ్ అంతా లౌడ్ గా ఉంది. ఈ ఇద్దరిలో మార్పుకు ఎంచుకున్న సెటప్ సినిమాటిక్ గా ఉంది కానీ సహజంగా కుదరలేదు. దీంతో సినిమా అట్టట్టే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ టైటిల్ లో ఉన్నంత ఫోర్స్ లేదని అర్థం అవుతుంది.

హీరోయిన్ కు PTSD అనే పాయింట్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది కానీ దాని చుట్టూ ఒక ఎంగేజింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. రొటీన్ గా తెలుగు సినిమాలలో ఉండే హీరో పాత్రకు PTSD అమ్మాయితో ప్రేమ అనే కాన్సెప్ట్ ను మూసగా ఉండే మాస్ మసాలా ఫార్ములా సినిమాగా ప్రెజెంట్ చేయడంతో కొత్తదనం పూర్తిగా ఆవిరయింది. దానికి తోడు అవసరం లేని బూతులు ప్రేక్షకులను చికాకు పెడతాయి. హీరో క్యారక్టర్ కు డ్రింకింగ్ వీక్నెస్ ఉంది అంటే అబ్జెక్షన్ లేదు కానీ సినిమా స్క్రీన్ పైన “మద్యపానం హానికరం” మెసేజ్ దాదాపు పర్మనెంట్ గా వాటర్ మార్క్ లాగా ఉందంటే మద్యం ఏ స్థాయిలో ఎరులై పారిందో అర్థం చేసుకోవచ్చు.

హీరో కిరణ్ రెగ్యులర్ గా తన సినిమాల్లో చేసే పాత్ర తరహాలోనే ఉండడంతో మంచి ఈజ్ తో నటించాడు. హీరోయిన్ జస్ట్ ఓకె. నటులు సాయి కుమార్, నరేష్, మురళిధర్ గౌడ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో సాయికుమార్ ఆకట్టుకుంటాడు. చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకె కానీ పాటలు మెప్పించేలా లేవు.

ఈ సినిమాను  సరదాగా కామెడీగా చూస్తే బాగుంటుంది. కొన్ని చోట్ల సీన్లు డ్రాప్ అయినట్టుగానూ అనిపించినా, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో నవ్వించే సన్నివేశాలు బాగానే ఉన్నాయి.ఇంటర్వెల్‌ వరకు అసలు కథ ఏ దిశగా వెళ్తుందో అర్థం కావడం కష్టమే. మెయిన్ ప్లాట్ ఇంటర్వెల్ తర్వాతే మొదలవుతుంది. కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ కూడా అప్పుడే క్లియర్ అవుతుంది. ఆ తర్వాతే కథనం కాస్త ఊపందుకుంటుంది. హీరోయిన్ పాత్రకు ఉన్న మానసిక సమస్య వల్ల  ఆ ట్రీట్మెంట్‌లో కొత్తదనం అంతగా కనిపించదు.కొన్ని జోకులు మరీ డబుల్ మీనింగ్‌గా ఉండటంతో, కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు . ఈ సినిమా చెప్పుకునేంత హైలైట్ కామెడీ మాత్రం అందించలేకపోయింది.. మధ్య మధ్యలో కొంచెం నవ్వు వచ్చీ వచ్చినట్టు వస్తుంది అంతే..

– సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. బోల్డ్ పేరుతో ఉన్న బూతు డైలాగులు
2. రొటీన్ హీరో పాత్ర చిత్రణ
3. పాటలు

-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. కిరణ్ అబ్బవరం యాక్టింగ్
2. సెకండ్ హాఫ్ లో కామెడీ

ఫైనల్ వర్డ్: ప్రేక్షకులకు K-Ramp

రేటింగ్: 2/5

 

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular