Trump U-turn: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పది రోజుల్లో యుద్ధాలన్నీ ఆపేస్తానని ప్రకటించారు. అధికారం చేపట్టి పది నెలలు కావొస్తున్నా ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మినహా ఏదీ ఆపలేదు. కానీ, అన్నీ తానే ఆపానని, తనకు నోబెల్ ప్రైజ్ కావాని తన అనుకూల దేశాలతో ప్రతిపాదన కూడా చేయించుకున్నాడు. కానీ, నోబెల్ కమిటీ ట్రంప్‌ను అసలు లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఇక మూడేళ్లకుపైగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ట్రంప్‌ను అసలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆగకపోతే తోమహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తానని రష్యాకు హెచ్చరిక జారీ చేశారు. కానీ కొద్ది రోజులకే అదే అధ్యక్షుడు ‘‘ఇప్పుడు ఇవ్వలేము’’ అంటూ వెనక్కు తగ్గడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
దౌత్య ఒత్తిడి ప్రయత్నమా?
ట్రంప్ పెట్టిన ప్రారంభ హెచ్చరిక రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సైకాలజికల్ ప్రెజర్ సృష్టించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక దాడి సామర్థ్యమున్న క్షిపణులు అందిస్తామని చెప్పడం ద్వారా అమెరికా మళ్లీ విధేయత చూపించే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రకటన తర్వాత మాస్కో నుంచి తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయి. ‘‘ఉక్రెయిన్కు క్షిపణులు ఇస్తే, రష్యా–అమెరికా సంబంధాలకు తిరిగిపోని నష్టం జరుగుతుంది’’ అని పుతిన్ స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకు ట్రంప్ వెనక్కు తగ్గారు.
జెలెన్సీ్కతో ట్రంప్ రహస్య చర్చలు..
తాజాగా ఓవల్ ఆఫీసులో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ్కతో సమావేశమైతో మహాక్ క్షిపణుల అంశంపై మాట్లాడారు. జెలెన్సీ్క, ‘‘అవి లభిస్తే పుతిన్ శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకుంటాడు’’ అని అభిప్రాయపడ్డారని అమెరికా మీడియా పేర్కొంది. కానీ ట్రంప్ మాత్రం ‘‘ప్రస్తుత సమయంలో అమెరికా నిల్వలను తగ్గించలేను. నా ప్రాధాన్యం యుద్ధాన్ని ముగించడం’’ అని స్పష్టంగా చెప్పారని సమాచారం. ఈ అభిప్రాయం ఆయన కొత్త విధానంగా భావిస్తున్నారు.
రష్యా–అమెరికా బంధాల్లో కొత్త మలుపు..
పుతిన్‌తో జరిగిన ఇటీవల భేటీ కూడా ఈ మార్పుకు కారణమని వాస్తవాలు సూచిస్తున్నాయి. ట్రంప్, రష్యా సహకారం లేకుండా ఉక్రెయిన్ శాంతి సాధ్యం కాదనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయుధాలు పంపడంపై కాకుండా శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీని వెనుక మరో అంశం కూడా ఉంది. అమెరికా అంతర్గత రాజకీయ ఒత్తిడి. కాంగ్రెస్‌లో కొందరు సెనేటర్లు యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ట్రంప్ నిర్ణయానికి రాజకీయ మద్దతు కూడా లభిస్తోంది.
ట్రంప్ పదే పదే మాట మార్చుతున్నారని విమర్శలు వస్తున్నా, ఆయనకు ఇది ఒక ప్రతిస్పందనాత్మక దౌత్యతంత్రం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. హెచ్చరికల ద్వారా రష్యాను భయపెట్టే ప్రయత్నం చేస్తూ, చివర్లో వెనక్కు తగ్గడం ద్వారా శాంతి ఆదిపత్యం చూపే వ్యూహం అవుతుందేమో అన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ఈ యూటర్న్ ఆయన విశ్వసనీయతకు దెబ్బతీస్తోంది. ప్రపంచ నేతగా సామరస్యానికి బదులు అయోమయం సృష్టిస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.