K Ramp First Week Collections: ఈ దీపావళి కి సైలెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిల్చిన చిత్రం ‘K ర్యాంప్'(K Ramp Movie). కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరో గా నటించిన ఈ సినిమాకు సోషల్ మీడియా లో కొంతమంది రివ్యూయర్స్ ఇండియా లో షోస్ మొదలు కాకముందే నెగిటివ్ రివ్యూస్ తో హోరెత్తించారు. కానీ ఈ చిత్రంలోని కామెడీ ఆడియన్స్ కి బాగా నచ్చడం తో మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని రాబట్టి లాభాల్లోకి అడుగుపెట్టింది. ఈరోజు నుండి ఈ సినిమా కి వచ్చే ప్రతీ పైసా లాభాల్లోకి చేరుతుంది. ఎంత లాభాలు వస్తాయి?, సినిమా హిట్ రేంజ్ దగ్గరే ఆగిపోతుందా?, లేదా సూపర్ హిట్ స్టేటస్ వరకు చేరుకుంటుందా అనేది చూడాలి. విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి మొదటి వారం 7 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 74 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి కోటి 21 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 3 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 12 కోట్ల 50 లక్షల వరకు ఉంటుంది. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 97 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 9 కోట్ల 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన ఈ చిత్రానికి 16 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్ల రూపాయలకు జరగగా, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 9 లక్షల రూపాయిల లాభం వచ్చింది. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ తప్ప, ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిల్చింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో తెలియదు కానీ, కిరణ్ అబ్బవరం కెరీర్ లో మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా కచ్చితంగా నిలబడబోతుంది. కిరణ్ అబ్బవరం ఇక్కడి నుండి ఇదే ఫ్లో ని కొనసాగిస్తూ సూపర్ హిట్స్ ఇస్తూ వెళ్తే కచ్చితంగా మరో నాని అవుతాడు. మరి మనోడి ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి మరి.