Arjun Das character in OG: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. మధ్యలో భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, ఓజీ అభిమానులకు ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. డైరెక్టర్ సుజిత్ కి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఎన్ని వందల సార్లు కృతఙ్ఞతలు తెలిపి ఉంటారో లెక్కే లేదు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓటీటీ లో విడుదలైంది. థియేటర్స్ లో కేవలం తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఈ సినిమా, ఓటీటీ లో దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరినీ అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఓటీటీ లో ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ ని చూస్తుంటే, కచ్చితంగా డిజిటల్ మీడియా లో ఈ సినిమా రాబోయే రోజుల్లో వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తర్వాత బాగా హైలైట్ అయిన క్యారెక్టర్స్ జిమ్మీ మరియు అర్జున్. అర్జున్ క్యారక్టర్ ని తమిళ నటుడు అర్జున్ దాస్ పోషించాడు. ఆయన క్యారక్టర్ ఇందులో బాగా పండింది, ముఖ్యంగా ఆయన బేస్ వాయిస్ సినిమాని అనేక సందర్భాల్లో ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది. ముఖ్యంగా టైటిల్స్ కార్డు పడేటప్పుడు ‘అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే’ అంటూ అర్జున్ దాస్ ఇచ్చే వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ రప్పించింది. అయితే సుజిత్ కథ ని రాసుకున్న మొదట్లో ఈ క్యారక్టర్ కోసం ఒక మలయాళం స్టార్ హీరో ని సంప్రదించాలని అనుకున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, తొనివో థామస్. ఇప్పుడు వరుసగా సూపర్ హిట్స్ ని అందుకొని మలయాళం ఇండస్ట్రీ లో టాప్ 3 హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
అలాంటి హీరో తో అర్జున్ దాస్ క్యారక్టర్ చేయించి ఉండుంటే కచ్చితంగా మలయాళం వెర్షన్ కి కాస్త ఉపయోగం ఉండేది. అంతే కాదు ప్రకాష్ రాజ్ క్యారక్టర్ కోసం అమితాబ్ బచ్చన్ ని అనుకున్నారు, ఒమీ క్యారక్టర్ కోసం కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ని అనుకున్నారు. ఇలా డైరెక్టర్ సుజిత్ చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉండేవాడు. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ సమస్య ఉండడం, వీళ్లంతా బిజీ ఆర్టిస్టులు కావడం తో వాళ్ళ డేట్స్ కూడా దొరకడం కష్టం అవుతుంది కాబట్టి స్వయంగా పవన్ కళ్యాణే వద్దని చెప్పాడట. దీంతో స్టార్స్ తో నిండిపోవాల్సిన ఓజీ, కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాల్సి వచ్చింది.