ప్రధాన మంత్రిగా రవీనా టాండన్

2011 లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పత్తర్ కె పూల్ చిత్రం తో హీరోయిన్ గా నటించి చిత్ర రంగ ప్రవేశం చేసిన రవీనా టాండన్ ఇప్పటివరకు 87 చిత్రాల్లో నటించింది. కాగా వాటిలో రధ సారధి , బంగారు బుల్లోడు , ఆకాశ వీధిలో , పాండవులు పాండవులు తుమ్మెద వంటి తెలుగు చిత్రాలు కూడా వున్నాయి. ఇక రవీనా టాండన్ తమిళం లో , కన్నడం లో కూడా కొన్ని చిత్రాలు చేసింది. […]

Written By: admin, Updated On : April 1, 2020 8:20 pm
Follow us on

2011 లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పత్తర్ కె పూల్ చిత్రం తో హీరోయిన్ గా నటించి చిత్ర రంగ ప్రవేశం చేసిన రవీనా టాండన్ ఇప్పటివరకు 87 చిత్రాల్లో నటించింది. కాగా వాటిలో రధ సారధి , బంగారు బుల్లోడు , ఆకాశ వీధిలో , పాండవులు పాండవులు తుమ్మెద వంటి తెలుగు చిత్రాలు కూడా వున్నాయి. ఇక రవీనా టాండన్ తమిళం లో , కన్నడం లో కూడా కొన్ని చిత్రాలు చేసింది. కాగా చాలా కాలం తరవాత మళ్ళీ కన్నడం లో ఒక భారీ చిత్రం చేస్తోంది. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో రవీనా టాండన్ చేసే పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉంటాయట …

2018 లో పాన్ ఇండియా మూవీ గా వచ్చిన కన్నడ చిత్రం కె. జి. ఎఫ్. యశ్ హీరోగా వచ్చిన ఈ భారీ బడ్జట్ చిత్రం 80 కోట్ల వ్యయం తో రూపొంది దేశ వ్యాప్తంగా 250 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రానికి ఇపుడో సీక్వెల్ తయారు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం భారీ అంచనాల నడుమ రూపొందే ఈ చిత్రం లో వివిధ భాషల తారలు నటిస్తున్నారు. వారిలో ప్రముఖ తెలుగు నటుడు రావు రమేష్ తో పాటు హిందీ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. అలాంటి కె. జి. ఎఫ్ 2 చిత్రం లో రవీనా టాండన్ ప్రధాన మంత్రి పాత్ర చేయ బోతోంది. 1981 కాలం నాటి ఈ ప్రైమ్ మినిస్టర్ పాత్రకు కొంత నెగటివ్ షేడ్ ఉండటం విశేషంగా చెప్పు కొంటున్నారు .
inventors are in gain