దేశమంతా కరోనాతో అల్లాడిపోతుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం..

ఒక పక్క దేశం మొత్తం కరోనా వైరస్ తో తీవ్రంగా పోరాడుతున్న సంగతి అందరికీ అర్థమవుతుంది. తగ్గినట్టే తగ్గి ఒక్కసారి మళ్ళీ విజృంభించడంతో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, దేశ రాజధాని ఢిల్లీ ఇలా ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రజలను ఏవిధంగా రక్షించుకోవాలని అర్థం కాక కేంద్ర ప్రభుత్వం కూడా […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 1:23 pm
Follow us on

ఒక పక్క దేశం మొత్తం కరోనా వైరస్ తో తీవ్రంగా పోరాడుతున్న సంగతి అందరికీ అర్థమవుతుంది. తగ్గినట్టే తగ్గి ఒక్కసారి మళ్ళీ విజృంభించడంతో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, దేశ రాజధాని ఢిల్లీ ఇలా ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రజలను ఏవిధంగా రక్షించుకోవాలని అర్థం కాక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా ఏం చేయాలా అనే దాని మీద ఇప్పుడు తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.

ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక పక్క దేశం కరోనా వైరస్ తో తీవ్రంగా పోరాడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇళ్ల పట్టాలను ఇళ్ల హామీ లేకుండా ఇవ్వలేదని ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తుంది అని ఒక జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నెంబర్ 99 తాజాగా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

ఏ విధంగా అయినా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకపక్క సుప్రీం కోర్టు కూడా కరోనా దెబ్బకు ఆన్ లైన్ లో కేసులను విచారిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు అత్యవసరంగా అనే విషయం గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్లాలి అనుకోవడం మాత్రం నిజంగా విడ్డూరంగా మారింది. అత్యవసర కేసుల్లో అయితే మినహా విచారించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ కేసు విషయం పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.