Sobhita Naga Chaitanya Engagement: నాగ చైతన్య రెండో చిత్రం ఏమాయ చేసావే. ఈ మూవీ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. సమంతకు ఏమాయ చేసావే ఫస్ట్ మూవీ. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఏమాయ చేశావే సూపర్ హిట్. నాగ చైతన్య-సమంత కెమిస్ట్రీ అదిరింది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ సినిమా విజయంలో కీలకం అయ్యాయి. సమంత-నాగ చైతన్య మధ్య రొమాంటిక్ సీన్స్ యువతకు గిలిగింతలు పెడతాయి. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకు సమంతకు నాగ చైతన్య ప్రపోజ్ చేశాడని సమాచారం. సమంత సైతం నాగ చైతన్య ప్రేమకు ఎస్ చెప్పింది.
చాలా కాలం వీరు రహస్యంగా ప్రేమించుకున్నారు. పెళ్ళికి కొన్నాళ్ల ముందు తమ రిలేషన్ బహిర్గతం చేశారు. 2017లో సమంత-నాగ చైతన్య పెళ్లి పీటలు ఎక్కారు. గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా సమంత-నాగ చైతన్య పేరు తెచ్చుకున్నారు. వీరు విడాకులు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు.
నాగ చైతన్య-సమంతలను కలపాలని కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా ప్రయత్నించారనే టాక్ ఉంది. విడాకుల విషయంలో సమంత టార్గెట్ చేయబడింది. సోషల్ మీడియా వేదికగా ఆమెను దూషించారు. సమంత మీద అనేక ఆరోపణలు చేశారు. సమంత పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ చేయడం కూడా కొందరు ఆమెను తప్పుపట్టడానికి కారణమైంది. సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. ఆమె అబార్షన్ కి పాల్పడిదంటూ నిందించారు.
సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ ఫోటోలు వైరల్ చేశారు. అసలే వేదనలో ఉన్న సమంత ఈ నిందలను భరించలేకపోయింది. ఆమె కొన్ని మీడియా ఛానల్స్ మీద లీగల్ యాక్షన్ సైతం తీసుకుంది. అయినా సమంత మీద సోషల్ మీడియా వేధింపులు ఆగలేదు. ఓ వర్గం ఆమెను కావాలనే టార్గెట్ చేసిందనే వాదనలు వినిపించాయి. నాగ చైతన్య కారణంగా సమంత ఆరోపణలు, అవమానాలు ఎదుర్కొంది.
ఇప్పుడు ఇదే పరిస్థితి శోభిత ధూళిపాళ్ల కి రావడం ఊహించని పరిణామం. గత రెండు రోజులుగా శోభిత ధూళిపాళ్లను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె గతంలో నటించిన బోల్డ్ సీన్స్, హాట్ ఫోటో షూట్స్ తెరపైకి తెస్తున్నారు. సమంత కంటే ఈమె అందగత్తె కాదు. నాగ చైతన్యకు శోభిత ఎలా నచ్చింది అంటూ చౌకబారు కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య-సమంత విడిపోవడానికి శోభితనే కారణం అంటూ… నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
సోషల్ మీడియా సంస్కృతి రాను రాను విపరీతంగా మారుతుంది. దీంతో ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి కూడా సంబంధం లేనివాళ్లు తలదూర్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వారి వ్యక్తిగత విషయం. అది మరచి ట్రోల్ చేయడం సరికాదు. అప్పుడు సమంత విషయంలో జరిగిన తప్పు మరలా శోభిత విషయంలో కూడా జరుగుతుంది. ట్రోల్స్ కి భయపడి శోభిత సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. అయితే శోభిత విషయంలో నాగార్జున ఆనందంగా ఉన్నారు. ఆయన మనస్ఫూర్తిగా తన కుటుంబంలోకి శోభితకు ఆహ్వానం పలికాడు. పెళ్ళికి ఇంకా సమయం ఉందని అంటున్నారు.