Murari Re Release: ‘కల్కి’ రికార్డ్స్ ని బద్దలు కొట్టిన ‘మురారీ’ రీ రిలీజ్..మొదటిరోజు ఎంత వసూళ్లు వచ్చాయంటే!

ఈమధ్య కాలం లో కాస్త స్లో అయ్యింది కానీ, నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మురారి' చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడంతో మళ్ళీ రీ రిలీజ్ ట్రెండ్ ఊపు అందుకుంది. నిన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా కొత్త సినిమాని ఎలా అయితే రిలీజ్ చేస్తారో, ఆ తరహాలో రిలీజ్ చేసారు.

Written By: Vicky, Updated On : August 10, 2024 12:40 pm

Murari Re Release

Follow us on

Murari Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో గడిచిన కొన్నేళ్ల నుండి మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. 2021 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఆయన పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ స్పెషల్ షోస్ ని వేసుకున్నారు. అవి గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో మహేష్ బాబు అభిమానులు రెండు నెలల గ్యాప్ ఇచ్చి దూకుడు సినిమా స్పెషల్ షోస్ వేసుకున్నారు. అలా చిన్నగా మొదలైన ఈ ట్రెండ్, పోకిరి, జల్సా సినిమాలతో తారాస్థాయికి చేరింది. అక్కడి నుండి ప్రతీ స్టార్ హీరో కి సంబంధించిన సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వచ్చారు మేకర్స్.

ఈమధ్య కాలం లో కాస్త స్లో అయ్యింది కానీ, నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడంతో మళ్ళీ రీ రిలీజ్ ట్రెండ్ ఊపు అందుకుంది. నిన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా కొత్త సినిమాని ఎలా అయితే రిలీజ్ చేస్తారో, ఆ తరహాలో రిలీజ్ చేసారు. మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారు కానీ, రికార్డ్స్ ని బద్దలు కొట్టే స్థాయిలో సక్సెస్ అవుతుందని మాత్రం అభిమానులు కూడా ఊహించలేదు. కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే నిన్న ఈ చిత్రం మూడు కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే ఏ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా కచ్చితంగా 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం రీ రిలీజ్ దాదాపుగా క్లోసింగ్ లో 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇప్పటి వరకు ఈ రికార్డుని ఒక్క హీరో కూడా అందుకోలేకపోయారు. కానీ మహేష్ బాబు మురారి చిత్రం కచ్చితంగా ఆ రికార్డుని అధిగమిస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు అభిమానులు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి బుక్ మై షో లో ఇప్పటి వరకు 2 లక్షల 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్థాయి బుకింగ్స్ గత వారం రోజులుగా ‘కల్కి’ చిత్రానికి కూడా జరగలేదట. అంతే కాకుండా కల్కి చిత్రానికి నిన్న వరల్డ్ వైడ్ గా మొత్తం కలిపి 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, మురారి చిత్రానికి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే కల్కి మీద డబుల్ వసూళ్లను రాబట్టి మురారి చిత్రం నిన్న సెన్సేషన్ సృష్టించింది అన్నమాట. మరి ‘మురారి’ సృష్టిస్తున్న ఈ రికార్డులను వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్న గబ్బర్ సింగ్ మ్యాచ్ చేస్తుందో లేదో చూడాలి.