Junior NTR: రోడ్డు ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు..కండిషన్ ఎలా ఉందంటే!

ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యాడు అనే వార్త తెలిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియా లో కంగారు పడ్డారు. మా అభిమాన హీరో కి ఏమి కాకూడదు అంటూ దేవుడిని ప్రార్థించారు. ఎన్టీఆర్ కి ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం కొత్తేమి కాదు.

Written By: Vicky, Updated On : ఆగస్ట్ 14, 2024 2:11 సా.

Junior NTR

Follow us on

Junior NTR: అవును..మీరు వింటున్నది నిజమే!..యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో ఆయన ఎడమ చేతి మణికట్టు మరియు వేళ్ళకు గాయాలు అయ్యినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్నతో ఎన్టీఆర్ కొరటాల శివ తో చేస్తున్న ‘దేవర’ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయం లో ఈ ప్రమాదం జరిగినట్టుగా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యాడు అనే వార్త తెలిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియా లో కంగారు పడ్డారు. మా అభిమాన హీరో కి ఏమి కాకూడదు అంటూ దేవుడిని ప్రార్థించారు. ఎన్టీఆర్ కి ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం కొత్తేమి కాదు. 2009 సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ పార్టీ కి ఆయన విస్తృతంగా ప్రచారం చేసాడు. ఆ సమయం లో సూర్యాపేట లో ఎన్టీఆర్ కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు, దీవెనలు కారణం గా ఎన్టీఆర్ ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డాడు. కానీ ఈసారి జరిగిన రోడ్డు ప్రమాదం చిన్నదే, అభిమానులు భయపడాల్సిన అవసరం ఏమి లేదంటూ ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఎన్టీఆర్ కి మాత్రమే కాదు, నందమూరి కుటుంబం మొత్తానికి ఈ యాక్సిడెంట్ గండం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి హరి కృష్ణ, సోదరుడు జానకి రామ్ ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎన్టీఆర్ ఇప్పుడు ఈ గండం నుండి రెండు సార్లు తప్పించుకున్నాడు. తన ప్రతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అభిమానులకు జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళండి, మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి అంటూ ఒక అన్న లాగా, తమ్ముడిలాగా ఎంతో ఆప్యాయంతో చెప్పేవాడు.

అంతే కాకుండా తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు రోడ్డు యాక్సిడెంట్ పై అవగాహన కల్పించేవిధంగా స్పెషల్ ఆడియో బైట్ ఇస్తుంటాడు. అలాంటి ఎన్టీఆర్ కి ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. ఎన్టీఆర్ ఒకప్పుడు చాలా స్పీడ్ గా కార్ తోలేవాడు. ఇప్పటికీ కూడా ఆయనలో ఆ వేగం తగ్గలేదు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ కారు మీద ర్యాష్ డ్రైవింగ్ కారణంగా చలాన్ కూడా ఉండేది. ఎన్టీఆర్ కి ఉన్న ఈ అలవాటుని చూసి అభిమానులు భయపడుతున్నారు. నీ శరీరం మీద చిన్న గాయం పడినా మేము తట్టుకోలేము, దయచేసి మాకోసం జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చెయ్యి అన్నా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కాసేపటి క్రితమే ‘ఆయ్’ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ వేసాడు, అంటే ఆయన ఇప్పుడు క్షేమంగానే ఉన్నట్టే, కాబట్టి అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు.