Junior NTR : ఎన్టీఆర్(Junior NTR) అభిమానులు ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో చేస్తున్న సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. అయినప్పటికీ కూడా మార్కెట్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గల్లంతే అని ట్రేడ్ బలమైన నమ్మకంతో ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల తేదీ మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోపక్క పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల విడుదల తేదీలు లాక్ అయిపోయాయి. ఎప్పుడూ లేట్ గా తన సినిమాలను విడుదల చేసే రాజమౌళి కూడా ‘వారణాసి ‘ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల కాబోతుంది. అదే విధంగా అల్లు అర్జున్ , అట్లీ మూవీ కూడా సమ్మర్ లోనే విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా సమ్మర్ మొత్తం ప్యాక్ అయిపోయింది. కానీ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ మూవీ విడుదల తేదీ మాత్రం ఇప్పటి వరకు లాక్ అవ్వలేదు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది లో షూటింగ్ పూర్తి అవ్వడం కూడా కష్టం లాగానే ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎక్కువగా రీ షూటింగ్ అంటూ సమయాన్ని వృధా చేస్తున్నాడట. షెడ్యూల్స్ సరిగా ప్లాన్ చేయకపోవడం వల్ల , షూటింగ్స్ వాయిదా పడడం , ఆర్టిస్టుల డేట్స్ అందుబాటులో లేకపోవడం వంటివి రెగ్యులర్ గా జరుగుతున్నాయట. అంతే కాకుండా, ప్రశాంత్ నీల్ కి ఏ షాట్ అయినా ఒక పట్టాన నచ్చదు. అలా నచ్చకే అప్పట్లో ‘సలార్’ చిత్రాన్ని కూడా చివరి నిమిషం లో వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ సినిమాకు కూడా అదే జరుగుతోంది అట. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ సినిమా కచ్చితంగా ఈ ఏడాది జూన్ నెలలో విడుదల అయ్యుండేది. మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ప్రశాంత్ నీల్ కారణంగానే అది సాధ్యం అవ్వలేదు. ఇకపోతే మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదల చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, అభిమానులు అయితే కచ్చితంగా బలంగానే ఆరోజున అప్డేట్ ని కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు అందరూ అనుకుంటున్నట్టు టైటిల్ డ్రాగన్ కాదట, మరొకటి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.