Priyanka Chopra
Priyanka Chopra : ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ లేడీ. ఒక దశలో నెంబర్ వన్ పొజీషన్ కైవసం చేసుకుంది. బడా స్టార్స్ తో జతకట్టింది. ప్రస్తుతం ఆమె ఒక తెలుగు సినిమాకు సైన్ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB 29లో ఆమె హీరోయిన్. ఆమెకు ఇది ఫస్ట్ తెలుగు మూవీ అని చెప్పొచ్చు. గతంలో రామ్ చరణ్ కి జంటగా జంజీర్ చేసినప్పటికీ అది హిందీ చిత్రమే. కాగా ప్రియాంక చోప్రా ముంబైలోని తన ఆస్తులను అమ్మకానికి పెట్టింది.
ప్రియాంక చోప్రాకు అంధేరి ఏరియాలో గల ఒబెరాయ్ గార్డెన్ లో ఆమెకు నాలుగు లగ్జరీ ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిని రూ. 16.18 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. కాగా 2021 వార్సేవా లో గల రెండు ఇళ్లను ప్రియాంక చోప్రా అమ్మేసింది. అలాగే 2023లో లోఖండ్ వాలాలో ఉన్న పెంట్ హౌస్ ని సైతం అమ్మేసింది. ఇంకా ప్రియాంక చోప్రాకు గోవాలో ఒక ఇల్లు ఉన్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా ముంబైలో ఉన్న ఆస్తులను అమ్మడం వెనుక కారణం ఏమిటనే చర్చ జరుగుతుంది.
కాగా బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సంబంధాలు తెంచుకుంది. ఆమె హిందీ చిత్రాలు చేయడానికి ఇష్టపడటం లేదు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ మీద ఆరోపణలు చేశారు. ఇక్కడ అన్నీ రాజకీయాలు. నాకు అవకాశాలు రాకుండా కొందరు చేస్తున్నాను. ఈ క్రమంలో గొడవలు కూడా అయ్యాయి. ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను. అందుకే బాలీవుడ్ కి దూరమయ్యాను, అన్నారు. హాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్న ప్రియాంక అక్కడే సెటిల్ అయ్యింది. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ లో ఆమెకు నివాసాలు ఉన్నాయి.
2018లో అమెరికన్ సింగర్, యాక్టర్ అయిన నిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి సంతానంగా ఉంది. అమెరికాలోనే ఉండిపోవాలని అనుకుంటున్న ప్రియాంక తన ఆస్తులను అమ్మేస్తున్నట్లు సమాచారం. ఇక SSMB 29 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఒరిస్సాలో షూటింగ్ జరుగుతుంది. రాజమౌళి సినిమాలో ఆఫర్ అంటే ప్రియాంక చోప్రా నక్కతోక తొక్కనట్లే. ఇక ఆమెకు పెద్ద మొత్తంలో పారితోషికం ముట్టినట్లు సమాచారం. గ్లోబల్ ఫేమ్ ఉన్న నేపథ్యంలో SSMB 29కి ఆమెను రాజమౌళి ఎంపిక చేశాడు.
Web Title: Priyanka chopra ssmb 29 heroine priyanka chopra is selling her assets
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com