No Detention policy : పాఠశాల విద్యాశాఖలో ఫెయిల్ విధానం ఇంతకాలం అమలు చేయలేదు. విద్యార్థుల మార్కులతో సంబంధం లేకుండా, హాజరు శాతం ఆధారంగా విద్యా సంవత్సరం ముగియగానే పై తరగతులకు అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చారు అధికారులు. అంతకు ముందు 7వ తరగతిలో బోర్డు ఎగ్జామ్ అమలు చేసేవారు. అయితే విద్యాశాఖ నిపుణులు, విద్యావేత్తల సూచనల మేరకు 1 నుంచి 9వ తరగతి వరకు డిటెన్షన్ విధానం ఎత్తివేశారు. నో డిటెన్షన్ అమలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా కేంద్రం నో డిటెన్షన్ విధానం రద్దు చేసింది. పాఠశాల విద్యలో 5, 8వ తరగతులను విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాలని నిబంధన విధించింది. ఉతీ‍్తర్ణత సాధించని వారికి మరో రెండు నెలలు సమయం ఇచ్చి మరోమారు పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్‌్సలో పాస్ అయితే పై తరగతికి ప్రమోట్ చేస్తారు.
16 రాష్ట్రాల్లో ఇప్పటికే రద్దు..
విద్యాహక్కు చట్టం – 2019 ప్రకారం.. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే నో డిటెన్షన్ విధానం రద్దు చేశారు. గెజిట్ ప్రకారం.. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. ఫలితాలు ప్రకటించిన రెండు నెలల్లోపే ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ ఆ పరీక్షల్లోనూ ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతి చదవాల్సి ఉంటుంది. పాస్ అయిన వారు మాత్రమే పై తరగతికి ప్రమోట్ అవుతారు. అయితే ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకూ ఏ విద్యార్థిని డిటెన్షన్ చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్రం ఆధ్వర్యంలో పాఠశాలల్లో
తాజా గెజిట్‌తో కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు వేల పాఠశాలల్లో నో డిటెన్షన్ విధానం రద్దవుతుంది. ఇందులో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు ఉన్నాయి. ఇక ఈ నిబంధన అమలు చేయడం అనేది రాష్ట్రాల వ్యక్తిగత నిర్ణయం. ఇప్పటికే ఢిల్లీతోపాటు 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు నోడిటెన్‌్సన్ విధానం రద్దు చేశాయి. హరియాణా, పుదుచ్చేరి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నో డిటెన్షన విధానం కొనసాగించనున్నాయి.