Junior NTR: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నేటి తరం హీరోలలో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే, ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్..నూనూగు మీసాలు కూడా రాని వయస్సులోనే ఇండస్ట్రీ లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఏకైక ఇండియన్ హీరో ఎన్టీఆర్ ఒక్కడే..అలాంటి ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు , బ్లాక్ బస్టర్ హిట్లు మరియు ఫ్లాపులు కూడా ఉన్నాయి..కానీ హిట్టు ఫ్లాప్ తో శమందం లేకుండా క్రేజ్ ని మైంటైన్ చేసే అతి తక్కువమంది హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్..లేటెస్ట్ గా #RRR సినిమా తో ఆయన క్రేజ్ బౌండరీలు దాటి పాన్ వరల్డ్ స్టార్ ఇమేజి ని తెచ్చిపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..కొమరం భీముడు పాత్రలో ఎన్టీఆర్ కనబర్చిన అద్భుతమైన నటన ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..అంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని మన అందరికి తెలిసిందే.

#RRR సినిమా తర్వాత వెంటనే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తాడు అని అభిమానులు అనుకున్నారు..కానీ ఇప్పటి వరుకు ఆ చిత్రం కనీసం పూజ కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు..ఆరు నెలల నుండి ఈ సినిమా వచ్చే నెల ప్రారంభం అవ్వబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి..కానీ నెలలు అయితే గడుస్తున్నాయి కానీ ఈ చిత్రం గురించి కనీసం ఒక్క వార్త కూడా బయటకి రావడం లేదు..అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటంటే ఈ సినిమా ఏడాది లో ప్రారంభం అవ్వడం అసాధ్యం అని తెలుస్తుంది..వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..మరో వార్త ఏమిటి అంటే ఎన్టీఆర్ కి సినిమాలు మీద ఆసక్తి తగ్గిందని..ఒప్పుకున్నా ఈ రెండు సినిమాలు పూర్తి చేసి తన మిగిలిన జీవితాన్ని సంపూర్ణంగా రాజకీయాలకు అంకితం చేసే ఆలోచనలో ఉన్నాడని వార్త వినిపిస్తుంది.

కొరటాల శివ తో పాటుగా, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాలు మినహా మరో సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడం లేదట..ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నాడు అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ రాబొయ్యే రోజుల్లో తెలియనుంది.