Homeఎంటర్టైన్మెంట్Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్ కు ష్యూరిటీ ఇచ్చిన హీరోయిన్… ఎవరో తెలుసా ?

Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్ కు ష్యూరిటీ ఇచ్చిన హీరోయిన్… ఎవరో తెలుసా ?

Aryan Khan:  డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో మూడు వారాల పాటు జైలు జీవితం గడిపిన సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. నిన్న ఆయన బెయిల్ పత్రాలు స్వీకరణకు గడువు ముగియడంతో… ఈరోజు విడుదల అయ్యారు. కాగా ఆర్యన్ కు స్వాగతం చెప్పడానికి షారుక్ కుటుంబ సభ్యులంతా ముంబై లోని జైలు వద్దకు వచ్చి… ఆర్యన్ ను ఇంటికి తీసుకెళ్లారు.

juhi chawla sign as a shoority for aryan khan bail

ఆర్యన్ ఖాన్ అక్టోబరు 2న క్రూయిజ్ షిప్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసిన తర్వాత అరెస్టయి, దాదాపు ఒక నెల జైలు జీవితం గడిపాడు. డ్రగ్స్-ఆన్-క్రూజ్ కేసులో మొత్తం 20 మందిని అరెస్టు చేసిన కేసులో ఆర్యన్ “A1 నిందితుడు”. 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్-క్రూయిజ్ కేసులో అరెస్టయిన తర్వాత మరో ఇద్దరు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

బాంబే హైకోర్టు తన ఆపరేటివ్ ఆర్డర్‌ను ఇచ్చాక ఎన్‌డిపిఎస్ కోర్టులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కోసం ఓ హీరోయిన్ ష్యూరిటీగా లక్ష రూపాయల బెయిల్ బాండ్‌పై సంతకం చేయడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నటి జుహీ చావ్లా శుక్రవారం ఆర్యన్ బెయిల్ పై ష్యూరిటీ సంతకం చేశారు. ఆర్యన్ ఖాన్ డబ్బు చెల్లించడంలో విఫలమైతే ఆమె చట్టపరంగా బాధ్యత వహిస్తుందని దీని అర్థం. అనేక సినిమాల్లో షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా కలిసి నటించారు. బాలీవుడ్ లో ఈ జంట గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సహ యజమానులుగా మారారు. ఆర్యన్ ఖాన్, జుహీ చావ్లా కుమార్తె జాన్వీ ఇటీవల IPL ఆటగాళ్ల వేలంలో పాల్గొన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version