Jr NTR Wishes Nara Lokesh: నేడు ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా లో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున ట్వీట్స్ వేస్తున్నారు నెటిజెన్స్. అందరూ ట్వీట్లు వేయడం వేరు, జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేయడం వేరు. నేడు ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నారా లోకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరో అద్భుతమైన సంవత్సరం గా ఈ ఏడాది కూడా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్ల నుండి సాక్షాత్తు తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ కి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయని ఎన్టీఆర్, ఇప్పుడు నారా లోకేష్ కి మాత్రం ఎలా శుభాకాంక్షలు తెలిపాడో అర్థం కావడం లేదంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేశారు.
చాలా ఏళ్ళ నుండి ఎన్టీఆర్ కి నారా ఫ్యామిలీ కి మధ్య రిలేషన్స్ సరిగా లేవని సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ వస్తోంది. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నందమూరి, నారా కుటుంబాల్లో తీవ్రమైన అలజడి చెలరేగింది. మొత్తం జైలు సమీపం లోనే తిష్ట వేసి కూర్చున్నారు. తన జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడా బయటకు రానటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బయటకు రావడం, టీడీపీ పార్టీ తరుపున నిరసన కార్యక్రమాలు చేయడం వంటివి చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎన్టీఆర్ వైపు నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఆయన కూడా జైలు కి వచ్చి చంద్రబాబు ని చూసి పరామర్శిస్తాడని అంతా అనుకున్నారు, కనీసం సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ అయినా ఇస్తారని భావించారు. కానీ ఏది జరగలేదు. సంతోషంగా తన కుటుంబం తో కలియుసి వరల్డ్ టూర్లు వేసాడు ఎన్టీఆర్.
దీనిని చూసి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఎన్టీఆర్ తీరుని తప్పుబడుతూ తీవ్రమైన విమర్శలు చేశారు. అసలే సోషల్ మీడియా లో నారా , జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయం లో చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ కనీస స్థాయిలో కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడం తో ఆ గొడవలు తారా స్థాయిలో జరిగాయి. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమయం లో ఎన్టీఆర్ నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసిన విషయమే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం లో ఉంది కాబట్టి, వాళ్ళతో భవిష్యత్తులో చాలా పనులు ఉంటాయి కాబట్టే ఎన్టీఆర్ లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపి ఉంటాడని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Many happy returns of the day @naralokesh! Wishing you another incredible year ahead.
— Jr NTR (@tarak9999) January 23, 2026