Pawan Kalyan Davos trip: పవన్ కళ్యాణ్ పై( AP deputy CM Pawan Kalyan ) కొత్త ప్రచారం మొదలుపెట్టేశారు. ఆయన దావోస్ ఎందుకు వెళ్లలేదని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ వెళ్లారు. కానీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు వారి ప్రశ్న. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. కానీ ఇక్కడ మాత్రం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను పిలవలేదా? పిలిచినా ఆయన వెళ్లలేదా? అనేది హాట్ టాపిక్ అవుతోంది.
గత ఏడాది సైతం..
గత ఏడాది దావోస్ లో ( davos )జరిగిన పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ వెళ్లారు. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడం పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జనసేన కేడర్ నుంచి అసంతృప్తి బయటపడింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా అటువంటి అసంతృప్తి కనిపిస్తోంది. తెలంగాణలో మెగాస్టార్ చిరంజీవిని తమ వెంట తీసుకెళ్లి దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగస్వామ్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఇమేజ్ పెరిగింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఏపీలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ను ప్రపంచ ఆర్థిక సదస్సుకు తీసుకెళ్లకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.
తన శాఖ పరిధి కాకపోవడంతో..
అయితే పవన్ విషయంలో చంద్రబాబు( CM Chandrababu) ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటారు. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ను సంప్రదించి అన్నీ చేస్తుంటారని తెలుస్తోంది. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన ఏ శాఖ కూడా పవన్ కళ్యాణ్ పరిధిలో లేదు. ఆయన అంత గ్రామీణ నేపథ్యం, అటవీ శాఖ వంటి వాటిని చూస్తున్నారు. ఆది నుంచి విదేశీ పర్యటనల విషయంలో పవన్ జోక్యం చేసుకోవడం లేదు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కూడా పవన్ పాత్ర అంతంత మాత్రమే. గత ఏడాది తెలంగాణ సీఎం వెంట ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. అప్పట్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ను ఎందుకు తీసుకువెళ్లలేదు అనేది ప్రశ్న వచ్చింది. కానీ అప్పట్లోనే పవన్ కళ్యాణ్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ను సంప్రదించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.