NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ డీజే స్క్వేర్ సక్సెస్ మీట్ కి హాజరయ్యారు. దేవర తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని హామీ ఇచ్చాడు. దాంతో దేవర బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అలాగే దేవర హక్కుల కోసం బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇటీవలే బిగ్ డీల్ క్లోజ్ అయ్యింది.
దేవర సినిమాకు ఎంత డిమాండ్ ఉందో ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఇక దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో పోస్ట్ ఫోన్ అయ్యింది. ఈసారైనా చెప్పిన తేదీకి తేవాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు. కొరటాల శివ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. దేవర షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఎన్టీఆర్ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఎన్టీఆర్ తన ఫస్ట్ బాలీవుడ్ మూవీగా వార్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ మరొక హీరోగా నటిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వార్ 2 తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపిస్తారని సమాచారం. ఈ సిరీస్ లో సల్మాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్ ఇప్పటికే భాగమయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ కి అయాన్ ముఖర్జీ దర్శకుడు. కాగా వార్ 2 లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో పది రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ నందు ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. ముంబైకి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడే మకాం వేశాడు. కొన్ని కీలక సన్నివేశాలు ఎన్టీఆర్ పై చిత్రీకరించనున్నారని సమాచారం. దేవర, వార్ 2 అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయాల్సి ఉంది.