ఇక నుండి కొత్త తరహా కథలనే సినిమాలుగా తీయాలని బలంగా నిర్ణయించుకున్నాడట దర్శకుడు త్రివిక్రమ్. నిజానికి త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అవ్వొచ్చు, వరుసగా సూపర్ హిట్ సినిమాలనే తీస్తాడనుకోవచ్చు. కానీ, కథ విషయానికి వస్తే.. త్రివిక్రమ్ ఇప్పటికీ వెనుకే పడిపోయాడు. రెగ్యులర్ మూస కథలకు తనదైన శైలి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసి, ఆ కథలను జనం చేత ఒప్పిస్తూ ఎలాగోలా తన సినిమాలను సూపర్ హిట్ చేస్తున్నాడు. అయితే, అసలు పాత కథలనే త్రివిక్రమ్ ఓ రేంజ్ లో కొత్తగా రాస్తూ హిట్ కొడుతున్నప్పుడు, ఇక కొత్త కథలతో ఎలాంటి హిట్స్ కొడతాడు ?
Also Read: ముంబైలో ఇల్లు కొనేస్తున్న ప్రభాస్.. ఎన్నికోట్లో తెలుసా..?
ఇదే విషయాన్ని ఈ మధ్య తరుచుగా తనకు చెబుతున్నారట త్రివిక్రమ్ సన్నిహితులు. అందుకే సినిమా లేట్ అయినా, ఇక నుండి కొత్త కథలను మాత్రమే సినిమాలుగా తీస్తా అని, తానూ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథను కూడా మార్చాడట. మొదట ఎన్టీఆర్ కి కథ చెప్పినప్పుడు రాజకీయాల మీద ఒక పాయింట్ చెప్పాడట. ఇప్పుడు కథ మారింది అని, పాన్ ఇండియా రేంజ్ లో కథ ఉంటుందని, అలాగే కథలో హీరో క్యారెక్టర్ కూడా చాల కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ లో మార్పు రావడానికి కరోనా కూడా ఒక కారణం అట.
Also Read: ప్రముఖ హీరోయిన్, దర్శకుడి ఇళ్లపై ఐటీ దాడులు
ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్‌లో మన తెలుగు ప్రేక్షకులు కూడా విదేశీ చిత్రాలు, సిరీస్‌లు, దేశీయ సిరీస్‌లు, పరభాషా చిత్రాలు చూడటం బాగా అలవాటు చేసుకున్నారని, ఇలాంటి సమయంలో తాము మూస సినిమాలను చేస్తే, జనం చూడరు అని త్రివిక్రమ్ ఫీల్ అయ్యాడట. అలాగే తన పనితనం పై ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, అలాగే తనను తాను మెరుగుపరుచుకోవడానికి లాక్ డౌన్ కాలాన్ని త్రివిక్రమ్ బాగా ఉపయోగించుకున్నాడట. ఇక వర్క్ విషయంలో కూడా తమ రెగ్యులర్ పద్ధతులను మార్చుకోవడానికి కూడా లాక్ డౌన్ పిరియడ్ త్రివిక్రమ్ కి బాగా పనికొచ్చిందట. మొత్తానికి త్రివిక్రమ్ నుండి కొత్త కథలు రాబోతున్నాయి అన్నమాట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్