https://oktelugu.com/

తారక్ సిస్టర్ ను ఎప్పుడైనా చూశారా..? ఈమె అని మీకు తెలుసా?

నంద‌మూరి న‌ట‌వార‌సుడిగా తెరంగేట్రం చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించుకున్నాడు. న‌వ‌ర‌స‌న న‌ట‌నా సార్వ‌భౌముడు ఎన్టీఆర్ పేరును వెండి తెర‌పై స‌మున్న‌తంగా నిల‌బెట్టి సార్థ‌క‌నామ‌ధేయుడు అనిపించుకుంటున్నాడు తార‌క్‌. పాత్ర ఏదైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే జూనియ‌ర్‌.. ఎక్క‌డా వంక పెట్ట‌డానికి వీల్లేకుండా త‌న‌దైన న‌ట‌నా చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. అందుకే.. ఆయ‌న సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చుగా.. కానీ.. న‌ట‌న‌లో మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు జూనియ‌ర్‌. ఆ విధంగా తెలుగు సినీ వినీలాకాశంతో టాప్ స్టార్ […]

Written By:
  • admin
  • , Updated On : February 10, 2021 / 01:53 PM IST
    Follow us on


    నంద‌మూరి న‌ట‌వార‌సుడిగా తెరంగేట్రం చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించుకున్నాడు. న‌వ‌ర‌స‌న న‌ట‌నా సార్వ‌భౌముడు ఎన్టీఆర్ పేరును వెండి తెర‌పై స‌మున్న‌తంగా నిల‌బెట్టి సార్థ‌క‌నామ‌ధేయుడు అనిపించుకుంటున్నాడు తార‌క్‌. పాత్ర ఏదైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే జూనియ‌ర్‌.. ఎక్క‌డా వంక పెట్ట‌డానికి వీల్లేకుండా త‌న‌దైన న‌ట‌నా చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. అందుకే.. ఆయ‌న సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చుగా.. కానీ.. న‌ట‌న‌లో మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు జూనియ‌ర్‌. ఆ విధంగా తెలుగు సినీ వినీలాకాశంతో టాప్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.

    Also Read: రెబల్ స్టార్ ను మల్దీవుల్లో ఇలా చూసి తట్టుకోగలమా?

    అయితే.. చాలా మందికి జూనియ‌ర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ గురించి మాత్ర‌మే తెలుసు. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాత్రం చాలా త‌క్కువ మందికి తెలుసు. 2009 ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ త‌ర‌పున జూనియ‌ర్‌ ప్ర‌చారం నిర్వ‌హించిన స‌మ‌యంలో ఆయన తల్లి గురించి ప్రపంచానికి తెలిసింది. అంతకు ముందు చాలా తక్కువ మందికి మాత్రమే ఆమె తెలుసు. అయితే.. జూనియర్ కు ఓ తోబుట్టువు కూడా ఉందన్న సంగతి మీకు తెలుసా?

    జూనియ‌ర్, హరికృష్ణ కుమారుడు అన్న సంగ‌తి తెలుసు. క‌ల్యాణ్ రామ్ సోద‌రుడు అన్న సంగ‌తి కూడా తెలుసు. కానీ.. వీరిద్ద‌రూ ఒకే త‌ల్లి పిల్ల‌లు కాదు. నందమూరి హరికృష్ణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కు ఇద్ద‌రు కుమారులు జ‌న్మించారు. వారే జానకీరామ్, కళ్యాణ్ రామ్. ఇక రెండో భార్య కు కూడా ఇద్ద‌రు పిల్ల‌లు క‌లిగారు. వారిలో ఒక‌రు జూనియర్ ఎన్టీఆర్ కాగా.. మ‌రొక‌రు అమ్మాయి.

    జూనియ‌ర్ కు చెల్లెలు ఉన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. ఆమె పేరు సుహాసిని. ఎన్టీఆర్ కు చెల్లెలు అంటే పంచ ప్రాణాలు. తన ప్రతీ సినిమా విడుదల కాకముందే చెల్లెలితో క‌లిసి చూస్తాడు జూనియ‌ర్‌. ఇక‌, సుహాసినికి సైతం అన్నంటే అనురాగం పాళ్లు చాలా ఎక్కువే. నిత్యం అన్న‌య్యను క‌లిసే సుహాసిని.. రాఖీ పండుగ రోజు మాత్రం ఎక్క‌డున్నా వెళ్లి రాఖీ క‌ట్టాల్సిందే. షూటింగ్ ప‌నుల్లో విదేశాల‌కు వెళ్లినా స‌రే.. విమానం ఎక్కేసి రాఖీ క‌ట్టి వ‌స్తుంది సుహాసిని.

    Also Read: అప్పుడు గుంపులో గోవింద పాత్ర‌లు.. ఇప్పుడు అన‌సూయ కోస‌మే ప్ర‌ధాన పాత్ర‌లు!

    ప్రస్తుతం సుహాసిని వివాహం చేసుకొని హైదరాబాద్ లోనే నివసిస్తోంది. మ‌రి, ఎందుకు సుహాసిని ఎక్క‌డా క‌నిపించ‌దు అంటే.. మీడియా ముఖంగా ఫోక‌స్ అవ్వ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ట‌. ప‌బ్లిసిటీకి దూరంగా ఉండాల‌ని కోరుకుంటుంద‌ట‌. అందుకే.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు చెల్లెలు అయినా.. అటు ప్రేక్ష‌కుల‌కు, ఇటు ఫ్యాన్స్ కు ఆమె ఎవ‌రో తెలియ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ట‌.

    ఈ కార‌ణం చేత‌నే ఫంక్షన్లలోనూ పెద్ద‌గా క‌నిపించ‌రు సుహాసిని. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గురించి.. ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉంటుంద‌ట‌ సుహాసిని. ద‌గ్గ‌రి వాళ్లు అన్న‌య్య నుంచి ఏం కావాల‌ని అడిగితే మాత్రం.. త‌మ బంధం ఇలా క‌ల‌కాలం కొన‌సాగితే చాలు అని స‌మాధానం ఇస్తుంద‌ట సుహాసిని. మ‌రి, ఈ అన్నాచెల్లెల్ల బంధం శాశ్వతం కావాల‌ని మ‌నం కూడా విష్ చేద్దామా?

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్