https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..?

ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 650 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోలింగ్‌, ఈవీఎం, వీవీపాట్ క‌మిష‌నింగ్, సీలింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇతర ఉద్యోగాలను ఈసీఐఎల్ భర్తీ చేస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది. http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 6 నెలల కాంట్రాక్ట్ పద్ధతిన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా వెబ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 10, 2021 / 01:56 PM IST
    Follow us on

    ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 650 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోలింగ్‌, ఈవీఎం, వీవీపాట్ క‌మిష‌నింగ్, సీలింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇతర ఉద్యోగాలను ఈసీఐఎల్ భర్తీ చేస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది. http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    6 నెలల కాంట్రాక్ట్ పద్ధతిన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి 31 నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

    ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపులు ఉంటాయి. కనీసం 60 శాతం మార్కులతో ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరం పోస్టు క్వాలిఫికేష‌న్ ఇండ‌స్ట్రియ‌ల్ అనుభ‌వం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈసీఐఎల్‌ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు ప్రయోజననం చేకూరుతుందని చెప్పవచ్చు.