https://oktelugu.com/

Jr NTR: ఎన్టీఆర్ ఆశ నెరవేరుతుందా ? లేదా ?

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడినా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడతాడు. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో అయితే మాట్లాడే ప్రతిమాటకు తారక్ ఆచితూచి వివరణ ఇస్తూ ఉంటాడు. తాజాగా ‘వెరైటీ’ అనే హాలీవుడ్ వెబ్ సైట్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఐతే మెయిన్ గా “ఆర్ఆర్ఆర్” సినిమా గురించి డిటైల్డ్ గా మాట్లాడిన ఎన్టీఆర్, తన తదుపరి రెండు సినిమాల గురించి కూడా రెండు మాటలు చెప్పాడు. […]

Written By:
  • Shiva
  • , Updated On : November 24, 2021 / 03:43 PM IST
    Follow us on

    Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడినా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడతాడు. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో అయితే మాట్లాడే ప్రతిమాటకు తారక్ ఆచితూచి వివరణ ఇస్తూ ఉంటాడు. తాజాగా ‘వెరైటీ’ అనే హాలీవుడ్ వెబ్ సైట్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఐతే మెయిన్ గా “ఆర్ఆర్ఆర్” సినిమా గురించి డిటైల్డ్ గా మాట్లాడిన ఎన్టీఆర్, తన తదుపరి రెండు సినిమాల గురించి కూడా రెండు మాటలు చెప్పాడు.

    ఇప్పుడు ఆ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. తన తర్వాత సినిమాను ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని.. ఇది ఒక రివెంజ్ డ్రామా అని తారక్ తన ఇంటర్వ్యూలో ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఇక కొరటాల సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం ఉంటుందని అక్టోబర్ 2022లో ఈ సినిమా మొదలవుతుందని ఎన్టీఆర్ తెలిపారు.

    నిజానికి ఈ సినిమాల గురించి మనకు ఇంతకుముందే తెలుసు. కాకపోతే ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ అవుతుందనే విషయంలో ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు. కానీ ఎన్టీఆర్, బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఓ సందర్భంలో బుచ్చిబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. కానీ దర్శకుడు బుచ్చిబాబు గురించి ఎన్టీఆర్ ఒక్క మాట కూడా చెప్పలేదు.

    ‘ఉప్పెన’ తీసి మంచి హిట్ కొట్టిన బుచ్చిబాబు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కూడా తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని హింట్ ఇచ్చాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం బుచ్చిబాబుతో సినిమా ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా కూడా చెప్పడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ఎన్టీఆర్ 2022 క్యాలెండర్ మొత్తం పై రెండు సినిమాలకే కేటాయించాడు.

    Also Read: Bigg Boss 5 Telugu: ముద్దులు, హగ్గులు దాటి ఏకంగా బెడ్ పైకి… అరె ఏంట్రా ఇది!

    కాబట్టి బుచ్చిబాబుకి ఎన్టీఆర్ డేట్లు ఇవ్వడం కష్టమే. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనకు నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ ను తెస్తోందని ఎన్టీఆర్ ఆశ. మరి ఎన్టీఆర్ ఆశ నెరవేరుతుందా లేదా ? అనేది చూడాలి.

    Also Read: Rajamouli: చరిత్ర ఇదీ… మరి రాజమౌళి ఏం చేస్తాడో?

    Tags