Kcr In Delhi:పక్కా స్కెచ్ తో ఢిల్లీ టూర్.. కేసీఆర్ కు లాభమేనా..?

Kcr In Delhi:వరిధాన్యం కొనుగోలు విషయంలో తాడో పేడో తేల్చుకుందామని ఢిల్లీ పయనమైన కేసీఆర్ అక్కడ పడిగాపులు కాస్తున్నారని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకునేందకు కేసీఆర్ శత విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే మోడీ సాగు చట్టాల రద్దు, క్రిప్టో కరెన్సీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో బిజీగా ఉండడంతో కేసీఆర్ కు అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి. దీంతో మోదీని కలిసే వరకు కేసీఆర్ బృందం ఈనెల 26 వరకు ఢిల్లీలోనే మకాం వేసే […]

Written By: NARESH, Updated On : November 24, 2021 6:14 pm

Modi KCR

Follow us on

Kcr In Delhi:వరిధాన్యం కొనుగోలు విషయంలో తాడో పేడో తేల్చుకుందామని ఢిల్లీ పయనమైన కేసీఆర్ అక్కడ పడిగాపులు కాస్తున్నారని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకునేందకు కేసీఆర్ శత విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే మోడీ సాగు చట్టాల రద్దు, క్రిప్టో కరెన్సీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో బిజీగా ఉండడంతో కేసీఆర్ కు అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి. దీంతో మోదీని కలిసే వరకు కేసీఆర్ బృందం ఈనెల 26 వరకు ఢిల్లీలోనే మకాం వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అప్పటి వరకైనా మోదీని కలుస్తారా..? కేసీఆర్ వెళ్లిన పని అవుతుందా..? అనే చర్చ సాగుతోంది.

Also Read: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనా?

Modi and KCR

తెలంగాణ వ్యవసాయాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించిన కేసీఆర్ వరిధాన్యం కొనుగోలు విషయంలో బీజేపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలో ఒకలా.. రాష్ట్రంలో ఒకలా ప్రకటనలు చేయడంతో ఢిల్లీ పెద్దలతో అమీ తుమీ తేల్చుకోవడానికి ఈ ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. అయితే ముందుగా నిర్దిష్ట అపాయింట్ మెంట్ లేకుండానే వెళ్లడంతో కేసీఆర్ మోదీ, షాలను కలిసే అవకాశం లేకుండా పోయింది. వారు ఇతర పనులతో బిజీగా ఉండడంతో కేసీఆర్ బృందం నిరీక్షించాల్సి వస్తోంది.

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికారులు మంగళవారం కేంద్ర ఆహార అధికారులను కలిసిన నేపథ్యంలో బాయిల్డ్ రైస్ కొనమని సంకేతాలిచ్చారు. అయితే సాధారణ బియ్యం సైతం ఏ మేరకు సేకరిస్తామని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నాటకమాడుతుందని చెప్పడానికి కేసీఆర్ కు మంచి అస్త్రం దొరికిందని అంటున్నారు. అయితే యాసంగిలో ధాన్యాన్ని ఏ మేరకు కొనుగోలు చేస్తుందో క్లారిటీ ఇవ్వాలని లేదంటే ఢిల్లీ నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చోవడంతో ఉత్కంఠ నెలకొంది.

అయితే కేసీఆర్ మాత్రం ఢిల్లీలోనే చివరి వరకు వేచి చూసి ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. కేంద్ర ధాన్యం కొనుగోలు విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదని, ఇదంతా కేంద్ర కుట్రేనని చెప్పనున్నారు. దీంతో రాజకీయంగా కేసీఆర్ కు లాభం చేకూరే అవకాశాలున్నాయని అంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ చెప్పింది జరగకున్నా రాజకీయంగా మాత్రం లాభం చేకూరే విధంగా ఉందని అంటున్నారు. ఒకవేళ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధాన్యం కొనులును పెంచితే అదీ తమకే లాభిస్తున్నంది గులాబీ నేతలు భావిస్తున్నారు. ఎటోచ్చి ఢిల్లీ టూర్ ను తమకు అనుకూలంగా మార్చుకునేలా గులాబీ బాస్ పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

Also Read: భాగ్యనగరంలో మరింత బలపడేందుకు బీజేపీ నజర్