Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడం లేదు. ఫలితంగా సమస్యలు తీరడం లేదు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరద ముంపు ప్రమాదం ఏర్పడి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికార యంత్రాంగా జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు పొంచి ఉండేవి కావని తెలుస్తోంది. కానీ యథా రాజ తథా ప్రజా అన్నట్లుగా రాష్ర్టంలో పాలన పడకేసిందని తెలుస్తోంది. అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడ కూడా మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో వరద ముప్పుకు ప్రజలు బలయ్యారు. ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. కానీ ప్రభుత్వంలో చలనం మాత్రం కనిపించడం లేదని సమాచారం.
కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. దీంతో బాధితుల గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రజల బాధలు వర్ణనాతీతం. వంతెనలు కొట్టుకుపోయి వరద నీరు ఊళ్లను ముంచెత్తాయి. అయినా ఎవరికి పట్టింపు లేకుండా పోతోంది. ఫలితంగా ప్రజల బాధలు తీర్చే మార్గాలు కనిపించడం లేదు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఈ నేపథ్యంలో వరద ముంపు ప్రాతాలను క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన సీఎం విందులు, వినోదాల్లో పాల్గొనడం గమనార్హం.
వరద పరిస్థితిపై మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే పని చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read: KCR : కేసీఆర్.. నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారా?
రాష్ర్టంలో పరిపాలన అధ్వానంగా మారింది. వరద ముంపు ప్రజల్నీ పీడిస్తున్నా ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదు. ఫలితంగా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. అయినా అధికార యంత్రాంగం కూడా ముందుకు రావడం లేదు. దీనిపై ఎవరు కూడా చొరవ చూపకపోవడంతో ప్రజలు మాత్రం తిప్పలు పడుతున్నారు. అయినా అటు ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Eatala Rajender:ఇక ఆకర్ష్ ఈటల..! సక్సెస్ అవుతుందా..?