Mahesh Babu
Mahesh Babu : ఇండస్ట్రీలో సక్సెస్ అంత తేలికగా రాదు. ఎన్నో అవమానాలను భరిస్తూ, ఎంతో మంది చేత విమర్శలను ఎదుర్కుంటూ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓన్ టాలెంట్ తో ఎదిగిన వారికి మాత్రమే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. అలాంటి వారు మాత్రమే ఇక్కడ గొప్ప గుర్తింపు సంపాదించుకుంటారు… సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే సినిమా అంటే ప్యాషన్ తో పాటు దాని కోసం ఏదైనా చేయగలిగే తెగింపైతే ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ సక్సెస్ లు వరిస్తాయి…
Also Read : మహేష్ బాబు ఇండియాలోనే స్టార్ హీరోగా మారుతాడా..?
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) తండ్రికి తగ్గ తనయుడుగా ఎదగడమే కాకుండా భారీ విజయాలను సాధిస్తూ ఆయనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఘట్టమనేని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో సినిమాలను చేస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే మరోకర లేరు అనేది ప్రూవ్ చేయడానికి రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… ఇక ఇదిలా ఉంటే కృష్ణ తర్వాత రమేష్ బాబు హీరో గా ఎంట్రీ ఇచ్చిననప్పటికి ఆయన హీరోగా రాణించలేకపోయాడు. ఇక ఆయన తర్వాత మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ ను అందుకోవడంతో ఘట్టమనేని ఫ్యామిలీ వారసుడిగా తన బాధ్యతలను కొనసాగిస్తూ మహేష్ బాబు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈయన తర్వాత వాళ్ళ బావ అయిన సుధీర్ బాబు ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయన అడపాదడపా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
మహేష్ బాబు వాళ్ల అక్క కొడుకు అయిన అశోక్ గల్లా కూడా హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరు స్టార్ హీరోలు ఇండస్ట్రీకి పరిచయమవ్వబోతున్నారనే విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది… రమేష్ బాబు కొడుకు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఆయనతో పాటుగా మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కూడా తొందర్లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
మరి వీళ్లిద్దరూ ఎలాంటి సినిమాలను చేస్తారు. ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారు. ఇద్దరు స్టార్ హీరోలుగా మారుతారా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి… మిగతా ఫ్యామిలీతో పోల్చుకుంటే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి చాలా తక్కువ మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు అంటూ కొన్ని వార్తలైతే వచ్చేవి…
కానీ ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండడం చూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి… మరి ఏది ఏమైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలుగా ఎవరు మారతారు? ఎవరు తర్వాత జనరేషన్ ని ముందుకు తీసుకెళ్తారనేది తెలియాల్సి ఉంది…
Also Read : మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ ఎవర్ గ్రీన్ పాత్ర ఏంటో తెలుసా..?