https://oktelugu.com/

ట్రైన్ ప్రయాణానికి 9 రూల్స్!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైలు ప్రయాణం పూర్తిగా మారిపోయింది. రైలు ఎక్కాలంటే ఇంతకుముందులా కాదు. చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. అనేక రూల్స్ పాటించాలి. 1.ఇ-టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులను మాత్రమే రైల్వే స్టేషన్‌ లోకి, రైలులోకి అనుమతిస్తారు. (కర్ఫ్యూ పాస్ అవసరం లేదు). ఇప్పటికీ కొందరు ప్రయాణికులు ప్రోటోకాల్స్ పాటించకపోవడంతో మళ్లీ ఆ ముఖ్యమైన అంశాలను గుర్తు చేస్తోంది రైల్వే. మరి ఆ పాయింట్స్ ఏవో తెలుసుకోండి. 2.ప్రయాణికులు 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌ కు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 10, 2020 / 01:29 PM IST
    Follow us on

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైలు ప్రయాణం పూర్తిగా మారిపోయింది. రైలు ఎక్కాలంటే ఇంతకుముందులా కాదు. చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. అనేక రూల్స్ పాటించాలి.

    1.ఇ-టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులను మాత్రమే రైల్వే స్టేషన్‌ లోకి, రైలులోకి అనుమతిస్తారు. (కర్ఫ్యూ పాస్ అవసరం లేదు). ఇప్పటికీ కొందరు ప్రయాణికులు ప్రోటోకాల్స్ పాటించకపోవడంతో మళ్లీ ఆ ముఖ్యమైన అంశాలను గుర్తు చేస్తోంది రైల్వే. మరి ఆ పాయింట్స్ ఏవో తెలుసుకోండి.

    2.ప్రయాణికులు 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌ కు చేరుకోవాలి. రైల్వే స్టేషన్‌ లోకి వెళ్లే ముందు థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. 

    3.అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఎలాంటి లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు. స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌ లో, రైలు కోచ్‌ లల్లో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్‌ లోకి వచ్చేప్పుడు, ప్రయాణ సమయంలో మాస్క్ తప్పనిసరి. 

    4.ప్రయాణానికి ముందే స్మార్ట్‌ ఫోన్‌ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్‌ లోడ్ చేసుకోవాలి.

    5.ప్రయాణికులకు లెనిన్, బ్లాంకెట్స్, కర్టైన్లు అందించరు. ప్రయాణికులు వాటిని వెంటతెచ్చుకోవాలి.

    6.ప్రయాణికులు ఆహారాన్ని, మంచినీళ్లను కూడా వెంటతెచ్చుకోవాలి.

    7.ప్రయాణికులు చాలా తక్కువ లగేజీతో రావడం మంచిది.

    8.రైలు ఎక్కేప్పుడు, ప్రయాణంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. 

    9. వెళ్లే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హెల్త్ ప్రోటోకాల్స్‌ని ప్రయాణికులు అంగీకరించాల్సి ఉంటుంది.

    పైన తెలపబడిన ముఖ్యమైన నియమనిబంధనల్ని ప్రయాణికులకు భారతీయ రైల్వే వివరించింది. 9 అంశాలతో ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది.  రైలు ఎక్కే ముందు ప్రయాణికులు ఆ 9 పాయింట్స్ గుర్తుంచుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ రైల్వే గతంలోనే ఇందులో కొన్ని అంశాలను ప్రయాణికులకు వివరించింది.