spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan image: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. భజన తగ్గించకపోతే కష్టమే!

Pawan Kalyan image: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. భజన తగ్గించకపోతే కష్టమే!

Pawan Kalyan image: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) సినిమాల్లో ‘తాత ‘ భజన ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కథతో సంబంధం లేకుండా ఈ భజన ఉండేది. ఆ కారణం చేత ఎన్టీఆర్ సినిమాలకు వెళ్లాలంటే, ఏముంది , భజన తప్ప ఏమి ఉండదు అనే అభిప్రాయం జనాల్లో కలిగింది. కొన్నేళ్ల పాటు ఎన్టీఆర్ సినిమాలను జనాలు చూడడం ఆపేసారు. కేవలం అభిమానులు ఒక్కటే థియేటర్స్ కి వెళ్లి చూసేవారు. ఈ పొరపాటు ని గమనించి అర్థం చేసుకున్న ఎన్టీఆర్, టెంపర్ చిత్రం నుండి మానేసాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమాలు ఒకప్పటి ఎన్టీఆర్ సినిమాలు లాగా మారిపోతున్నాయి. సినిమాలో ఎదో ఒక చోట ఉంటే పర్లేదు. కానీ భజన చేయడానికే సినిమా తీయడం అన్యాయం. అభిమానులకు కూడా ఈ విషయం లో చిరాకు వచ్చేసింది.

ఎందుకంటే ఇప్పుడున్న అభిమానులు మొత్తం జెన్ జీ కి సంబంధించిన వాళ్ళు. చాలా అప్డేట్ గా ఉంటారు. ఇలాంటి భజన ని అసలు ప్రోత్సహించారు. తొక్కి మూలాన కూర్చోపెడుతారు. అందుకు రీసెంట్ గా ఉదాహరణ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పూర్తిగా అవుట్ డేటెడ్ డైరెక్టర్ గా మారిపోయిన హరీష్ శంకర్ పైత్యానికి పరాకాష్ట నే ఈ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు అతను కథని నమ్ముకోలేదు, కేవలం భజన ని మాత్రమే నమ్ముకున్నాడు. ఒక ఎమోషన్ లేదు, ఫన్ లేదు, స్టోరీ లేదు, అసలు ఎందుకు ఈ సినిమాని తీసాడో ఆయనకైనా క్లారిటీ ఉందో లేదో అర్థం కాలేదు. ఇలాంటి సినిమా చేయడానికా ?, ఆయన ఇన్నేళ్ల విలువైన సమయం తీసుకున్నాడు ?, దీనికి బదులు తేరి ని రీమేక్ చేసినా సరిపోయేది కదా, కనీసం ఎమోషన్స్ అయినా బాగా వర్కౌట్ అయ్యేవి.

Also Read: రామ్ చరణ్ ను కాపీ కొట్టమంటావా అంటూ దర్శకుడి మీద ఫైర్ అయిన మహేష్ బాబు..

పవన్ కళ్యాణ్ నిజంగా గొప్ప మనిషే, ఆయన ఎన్నో సేవలు చేస్తున్నాడు, ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు. అది ప్రతీ ఒక్కరికి తెలిసిందే, కానీ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. కేవలం ఆయన చేత డ్యాన్స్ వేయించే సీక్వెన్స్ 30 నిమిషాల వరకు ఉంటుంది. ఆడియన్స్ విలువైన సమయాన్ని కేటాయించి థియేటర్స్ కి వస్తే , వాళ్ళ మీద అయినా కనీసం గౌరవం ఉండకపోతే ఇక ఎందుకు సినిమాలు తీయడం. నల్లమల్ల అడవుల్లో ఈమధ్య నక్సలైట్స్ కూడా కనిపించడం లేదు, అలాంటిది టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుతున్నట్టు చూపించారు. కథ ఒక చోట నుండి ఆపరేషన్ సింధూర్ వరకు వెళ్ళిపోతుంది. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి అసలు ఈ సినిమా ఎప్పుడు అయిపోతుంది రా బాబు అని అనిపించేలా చేసింది. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఈ భజన ఎక్కువ అయిపోయింది. ఆపకపోతే కెరీర్ డేంజర్ లో పడే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper