Jr NTR Market: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. మన స్టార్ హీరోలు పాన్ ఇండియాలో వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. దేవర సినిమాతో 500 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ‘వార్ 2’ సినిమాతో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్నాడు…ప్రస్తుతం బాలీవుడ్ మాఫియా సైతం జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ మీద విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టైర్ వన్ హీరోల్లో ఎవ్వరికీ అంత తక్కువ మార్కెట్ లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డైలమాలో పడిపోయే ప్రమాదం ఉంది. తన మార్కెట్ ను విస్తరింప చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సైతం బాలీవుడ్ మాఫియా మీద ఫైర్ అవుతున్నారు.
ఎన్టీఆర్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన రాబోయే సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకొని మరోసారి టాప్ వన్ హీరోగా మారతాడంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి నటుడు ఎలాంటి క్యారెక్టర్ అయిన సరే అలవోక గా చేసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం…
ఇప్పటివరకు ఆయనను మించిన నటుడు ఇంకెవరు లేరు… ఇలాంటి నటుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా విషయంలో కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేస్తే మంచిదాని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటులు చాలామంది ఉన్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ను బీట్ చేయడంలో మాత్రం చాలా మంది వెనుకబడి పోతున్నారు. ఆయనకి భారీ విజయాలు ఉన్నప్పటికి కలెక్షన్స్ విషయంలో మాత్రమే చాలా వరకు వెనుకబడి పోతున్నాడు…దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…