spot_img
Homeబిజినెస్Xiaomi 17: లగ్జరీ ఫోన్ లవర్స్ కు.. ఇదే బెస్ట్ ఫోన్.. ధర కూడా అందుబాటులోనే..

Xiaomi 17: లగ్జరీ ఫోన్ లవర్స్ కు.. ఇదే బెస్ట్ ఫోన్.. ధర కూడా అందుబాటులోనే..

Xiaomi 17: మొబైల్ వాడే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన ఉంటుంది. కొందరు బడ్జెట్లోనే మొబైల్ కొనాలని చూస్తే.. మరికొందరు ప్రీమియం ఫోన్లనే కొంటూ ఉంటారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు యూత్ ను ఆకర్షించేందుకు ప్రీమియం డివైస్ లను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటాయి. ప్రముఖ కంపెనీ Xiaomi లేటెస్ట్ గా ఫ్లాగ్ ఫిష్ మొబైల్ నువ్వు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో సాఫ్ట్వేర్ అప్డేట్ తో పాటు ప్రీమియం ఫీచర్లు ఉండడంతో చాలామంది దీనిని లైక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2025లో రిలీజ్ అయిన షియోమీ 15 కు కొనసాగింపుగా వచ్చిన ఈ మొబైల్ లో ఉండే ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

షియోమి 17 డిజైన్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 6.3 అంగుళాల AMOLED డిస్ప్లే నువ్వు చూడొచ్చు ఇది 1.5 కే రిజల్యూషన్ తో పని చేస్తుంది. ఎలాంటి వాతావరణంలో నైనా ఖచ్చితమైన రంగులను చూపించేందుకు ఈ డిస్ప్లే బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేటితరం యూత్ మూవీస్ మొత్తం మొబైల్ లోనే చూస్తున్నారు. అలాగే గేమింగ్ కూడా మొబైల్ లోనే ఉండడంతో చాలామందికి ఈ డిస్ప్లే బాగా నచ్చుతుంది అని అంటున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ 16 వెర్షన్ సాఫ్ట్వేర్ లో ఉంచారు. దీంతో మొబైల్ వేగం ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ గా దీనిపై వర్క్ కావాలని అనుకునే వారికి ఇది సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇందులో Qualcomm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 తోపాటు 12 GB రామ్ ఉండనుంది. అలాగే 256 నుంచి 512 వరకు స్టోరేజ్ కెపాసిటీ ఉండడంతో కావాల్సిన ఫొటోస్, వీడియోలు స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

నేటి కాలం యూత్ చాలామంది మొబైల్ లో మంచి కెమెరా కోరుకుంటున్నారు. వారికి అనుగుణంగా ఇందులో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే టెలిఫోటో కెమెరా 50 MP తో పనిచేస్తుంది. అల్ట్రా వైడ్ కెమెరా 50 MP గా ఉండనుంది. సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం 50 MP తో పని చేయనుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరాలు బాగా పనిచేస్తాయి. ఈ మొబైల్ లో 6,330 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. రోజువారి వినియోగదారులతోపాటు బిజీగా ఉండే వారికి ఈ బ్యాటరీ సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఒక్కసారి చార్జింగ్ చేస్తే 19 గంటల పాటు బ్యాటరీ నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ మొబైల్ ను అమెజాన్ ద్వారా రూ.89,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం ఫోన్ల కోసం ఎదురుచూసే వారికి ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular