JR NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న సంతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు, సినిమా విడుదల ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. కాగా, ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తీయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా.. ఎన్టీఆర్ చేతికి గాయం కావడం వల్ల నిలిచిపోయింది.
కాగా, ఇలాంటి తరుణంలో వచ్చిన గ్యాప్‌ను ఫ్యామిలీతో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు ఎన్టీఆర్. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేశాడు. తాజాగా, ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ బయలుదేరాడు. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి విమానాశ్రయంలో ఉన్న ఎన్టీఆర్ పిక్ ఒకటి ప్రస్తుతం నెట్టింగా వైరల్‌గా మారింది. అయితే, ఈ ట్రిప్ ఎన్నిరోజులన్నది తెలియాల్సి ఉంది.
కాగా, ఎన్టీఆర్ ట్రిప్‌కు వెళ్లడం ప్రస్తుతం నెట్టింట చర్చగా మారింది. నిన్న అసెంబ్లీ వేదికగా నందమూరి కుటుంబాన్ని అవమానపరుస్తూ వైసీపీ వాడిన పదజాలంపై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో, చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం మరింత ఉద్రేకాన్ని కలిగించింది. కాగా, ఈ విషయంపై నందమూరి హీరోలు స్పందించారు. ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా బాధను వ్యక్తం చేశారు. కాగా, ఇటువంటి సమయంలో తారక్ ట్రిప్ వేయడం ఏంటని కొంతమంది అంటున్నారు. మరికొంత మంది వెళ్తే తప్పేంటి.. కుటుంబంతో గడపాలనుకోవడం కూడా తప్పేనా అంటూ తారక్‌ను సమర్థిస్తున్నారు. కాగా, తారక్, చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.