Jr NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో తనదైన రీతిలో వరుస సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేసిన “త్రిబుల్ ఆర్” సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని మూటగట్టుకుంది. ఇక ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది.
దాంతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ‘దేవర ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.. ఇక దానికి తగ్గట్టుగానే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ షూటింగ్ లో కూడా పాల్గొని కొంచెం షూట్ ను కూడా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని పూర్తి చేసిన వెంటనే ఆయన ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన సినిమా మీదికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలీవుడ్ లో ఉన్న మరొక దిగ్గజ దర్శకుడితో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక దీన్ని బాలీవుడ్ లోనే అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్ గా పిలవబడే ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ వాళ్ళు నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఎన్టీయార్ తన డైరీ ని రెండు సంవత్సరాల పాటు ఖాళీ లేకుండా ఫుల్ ఫిల్ చేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ ప్లానింగ్ అయితే చాలా అద్భుతంగా కుదిరిందనే చెప్పాలి. ఆయన ప్రస్తుతం వార్ 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఇక ఇది ముగిస్తే దేవర సినిమాలో కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయట. అవి కూడా పూర్తి చేసి ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా మీద వెళ్లబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి… ఇక ఈ సంవత్సరం దేవర సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడనే విషయం కూడా చాలా స్పష్టం గా తెలుస్తుంది…