Prabhas-Hanu Raghavapudi Movie Title Fixed
Prabhas-Hanu Raghavapudi: బాలీవుడ్ ను మించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సినిమాలు చేస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నారు. ఇక ఇండియాలో ఉన్న జనాలందరికి తెలిసిన విషయం ఏంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే కూడా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పవర్ ఫుల్ గా మారిందని, అలాగే చాలా పెద్ద ఇండస్ట్రీ గా కూడా మారుతుంది అనేది జనాలు చెబుతున్న మాట. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ మరొక భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే కల్కి, రాజసాబ్, స్పిరిట్ లాంటి సినిమాలను సెట్స్ మీద ఉంచిన ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక పీరియాడికల్ డ్రామా సినిమాని కూడా తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తీవ్రమైన కసరత్తులను కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా జులై నుంచి సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టుగా సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక అందులో భాగంగా ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ ను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకటి ‘ఫౌజీ ‘ కాగా, మరొకటి ‘ ధీర ‘..అయితే ఈ సినిమా కోసం ఈ రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ఒక టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.
అలాగే ఒక సింపుల్ లవ్ స్టోరీ తో కూడా ముందుకు సాగబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక హను రాఘవపూడి అంటే లవ్ స్టోరీ సినిమాలని చాలా బాగా తీస్తాడు అనే పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ సినిమాను కూడా ఒక క్లాసికల్ సినిమాగా నిలిపే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే హను రాఘవపూడి ఇప్పుడు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని పాన్ ఇండియా లో దిగ్గజ దర్శకుడి గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇది ఇలా ఉంటే రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ను లవర్ బాయ్ గెటప్ లో అసలు చూడలేకపోయాం.
మరి ఈ సినిమాలో ఆయన ఇప్పుడు ప్రభాస్ ని ఎలాంటి గెటప్ లో చూపిస్తాడు ఈ సినిమాలోని లవ్ స్టోరీ కి అనుకూలంగా తన గెటప్ ను సెట్ చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి… చూడాలి మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొడతాడా లేదా అనేది…