Jr NTR Flop Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన ఎలాంటి పాత్రను చేసిన అందులో తన మార్క్ చూపిస్తూ ఉంటాడు.ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో చాలామంది దర్శకులు అతనికి సక్సెస్ లను అందించినప్పటికి ఆయన నమ్మిన కొంత మంది దర్శకులు మాత్రం అతనికి భారీ సక్సెస్ లను అందించలేకపోయారు. అందులో ముఖ్యంగా మెహర్ రమేష్ ఒకరైతే, సురేందర్ రెడ్డి ఇంకకరు.
Also Read : బిన్ లాడన్ బట్టలిప్పి మరీ చేదు నిజాలు చెప్పిన పూరి.. వైరల్…
మెహర్ రమేష్ కంత్రి, శక్తి లాంటి రెండు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగలడంతో ఆయన కొంతవరకు డీలాపడ్డాడు. ఇక సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేసిన అశోక్, ఊసరవెల్లి సినిమాలు కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ఆ సినిమాలు మాత్రం సక్సెస్ లను సాధించలేకపోయాయి.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే కెపాసిటి ఉన్న ఈ హీరో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు కూడా భారీ రేంజ్ లో సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి లేనటువంటి గొప్ప గౌరవాన్ని దక్కించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం.
ఇక దేవర (Devara) సినిమాతో గత సంవత్సరం సక్సెస్ ని సాధించినప్పటికి ఆయన పొటెన్షియాలిటీని బయటకు తీసే సక్సెస్ మాత్రం అది కాదనే చెప్పాలి. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాతో తను ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…