Puri Jagannadh on Bin Laden, : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) పూరి మ్యూజింగ్స్ (Puri Musings) పేరుతో తన అభిమానులకు కొన్ని విషయాల మీద అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అలాంటి క్రమంలోనే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు… కొన్ని వేల మంది చావులకు కారణమైన సెప్టెంబర్ 11 దాడిలో ప్రధాన నిందితుడు అయిన ఉసామా బిన్ లాడెన్ లాస్ట్ 10 సంవత్సరాలు ఎవ్వరికి తెలియకుండా చాలా రహస్యమైన జీవితాన్ని గడిపాడు. ఒక రకంగా అజ్ఞాతం లోకి వెళ్ళి బ్రతికాడు…
పాకిస్థాన్ స్వాత్ వ్యాలీలో వేగంగా వెళ్తున్న కారులో ఒకరు నీట్ గా షేవ్ చేసుకొని కూర్చొని ఉన్నారు. అక్కడి పోలీసులు ఆ కారును ఆపారు. కొద్దిసేపు ఆ డ్రైవర్ తో ఏదో మాట్లాడి ఆ తర్వాత అతన్ని పంపించారు. నిజానికి ఆ కారు లో నీట్ షేవ్ తో ఉన్నది ఉసామా బిన్ లాడెన్ అనే విషయం ఆ పోలీసులు గుర్తించలేకపోయారు. ఒకవేళ వాళ్ళు అప్పుడే అతన్ని గుర్తిస్తే ఒక 10 సంవత్సరాలు ముందే బిన్ లాడెన్ దొరికేవాడు. ఇక అబోట్టాబాద్ లో ఆయన సెటిల్ అయ్యాడు. ఆయన ఉన్న ఇంటి పేరు వజిరిస్తాన్…మూడు అంతస్తులతో ఆ ఇల్లు ఉండేది…అందులో ఆయనతో పాటు ఆయన ముగ్గురు పెళ్ళాలు, 8 మంది పిల్లలతో పాటు 5 గురు మనవళ్ళు ఉండేవారు…ఇక లోపల ఏం జరుగుతుందో తెలియకుండా 12 నుంచి 18 అడుగుల ఎత్తులో కాంపౌండ్ వాల్ ఉండేది…
అక్కడి నుంచి ఎవ్వరు బయటికి వచ్చేవాళ్ళు కాదు. చివరికి చెత్తను సైతం లోపలే తగలబెట్టారు…బిన్ లాడెన్ కి నాలుగు జతల బట్టలు, ఒక జాకెట్, రెండు స్వేటర్స్ ఉండేవి…ఇక స్పై శాటిలైట్స్ నుంచి తప్పించుకోవడానికి ఆయన ఇంటి బయటికి వచ్చిన ప్రతి సారి కౌబాయ్ క్యాప్ పెట్టుకొని వచ్చేవాడు…అలాగే రూమ్ బయటే వాకింగ్ చేసేవాడు. అతన్ని ఎవ్వరు గుర్తుపట్టేవారు కాదు. ఇక వాళ్ళకి బయటి నుంచి ఏదైనా అవసరం ఉంటే ఆయన రైట్ హ్యాండ్ అయిన అహ్మద్ ఆల్ కువైటీ, ఆయన స్నేహితులు అయిన అబ్రార్ మాత్రమే అతనితో కమ్యూనికేషన్ లో ఉండేవాళ్ళు…ఇక అదే ఇంట్లో లాడెన్ తన చిన్న భార్య తో సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ లో ఎక్కువగా గడిపేవాడు…
అలాగే తనకి కావలసిన కూరగాయలను అక్కడే పండించుకొని తినేవాడు…కోళ్లు కుందేళ్ళతో ఎక్కువ సమయం గడిపేవాడు. తన మనవాళ్ళతో మొక్కలు నాటించి ఎవరి మొక్కలు ముందుగా పెరుగుతాయో చూద్దాం అంటూ ఒక పోటీ పెట్టేవాడు. సీక్రెట్ శాటిలైట్ డిష్ పెట్టించుకొని ఒబామా తన గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునేవాడు…
సీల్ టీమ్ అతని ఇంట్లో చొరబడి అతన్ని చంపిన తర్వాత అతని కంప్యూటర్ లో 4.70 లక్షల ఫైల్స్ దొరికాయి…అందులో కొన్ని పోర్న్ వీడియోలు ఉండగా, ఒబామాను ఎలా చంపాలో వేసిన ప్లాన్స్ కూడా సేల్ టీమ్ కి దొరికాయి…ఇక సెప్టెంబర్ 11 దాడికి కారణమైన బిన్ లాడెన్ ఒక 10 సంవత్సరాలు అజ్ఞాతం లో ఉండి భయపడుతూ బతికాడు అంటూ పూరి జగన్నాధ్ చెప్పాడు…