https://oktelugu.com/

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సారి రాజమౌళి పై.. !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో ఒకటిగా కనిపించబోతుండే సరికి ఈ సినిమా పై మొదటి నుండి నేషనల్ వైడ్ గా భారీ ఆసక్తి నెలకొంది. అయితే తెలుగులో మాత్రం రాజమౌళి పై కోపంగా ఉన్నారట ఇక్కడ ప్రేక్షకులు. మే […]

Written By:
  • admin
  • , Updated On : June 23, 2020 / 07:58 PM IST
    Follow us on


    యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో ఒకటిగా కనిపించబోతుండే సరికి ఈ సినిమా పై మొదటి నుండి నేషనల్ వైడ్ గా భారీ ఆసక్తి నెలకొంది. అయితే తెలుగులో మాత్రం రాజమౌళి పై కోపంగా ఉన్నారట ఇక్కడ ప్రేక్షకులు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ పాత్ర మీద రాజమౌళి ఎలాంటి వీడియోను రిలీజ్ చేయకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు.

    కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం

    కనీసం ఇప్పుడైనా షూట్ చేసి తమ కోసం ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన పోస్టర్ అయినా రిలీజ్ చెయ్యొచ్చు కదా, ఫ్యాన్స్ ను వారి మనోభావాలను రాజమౌళి పట్టించుకోవడం లేదని, తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాజమౌళి పై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి కరోనా కారణంగా ఎన్టీఆర్ పార్ట్ కి సంబంధించి వర్క్ మొత్తం ఆగిపోయింది. దాంతో ఫ్యాన్స్ కోసం ఏదో రిలీజ్ చేయాలి కదా అని ఏదొకటి రిలీజ్ చేయడం ఇష్టం లేకే రాజమౌళి తారక్ వీడియోను రిలీజ్ చేయలేదు.

    వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

    అయితే ఎన్టీఆర్ వీడియో అద్భుతమైన అవుట్ ఫుట్ తోనే రిలీజ్ చేయాలనేది జక్కన్న ప్లాన్. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెప్పించటానికి రాజమౌళి ఏం చేస్తాడో చూద్దాం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.