టీవీ పరిశ్రమపై కరోనా పంజా

కరోనా ఎఫెక్ట్ చిత్రపరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా, టీవీ షూటింగులు వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సెలబెట్రీలంతా ఇంటికే పరిమితయ్యారు. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో అభిమానులతో తమ అనుభవాలను పంచుకున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్లో సినిమా, టీవీ షూటింగులకు ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగులు చేసుకోవాలని అనుమతి రావడంతో ఇటీవల టీవీ షూటింగులు ప్రారంభమయ్యాయి. కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన […]

Written By: Neelambaram, Updated On : June 23, 2020 8:03 pm
Follow us on


కరోనా ఎఫెక్ట్ చిత్రపరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా, టీవీ షూటింగులు వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సెలబెట్రీలంతా ఇంటికే పరిమితయ్యారు. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో అభిమానులతో తమ అనుభవాలను పంచుకున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్లో సినిమా, టీవీ షూటింగులకు ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగులు చేసుకోవాలని అనుమతి రావడంతో ఇటీవల టీవీ షూటింగులు ప్రారంభమయ్యాయి.

కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం

తాజాగా ఓ ప్రముఖ టీవీ సీరియల్ షూటింగ్ ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న ఓ ప్రముఖ యాక్టర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో కలకలం మొదలైంది. తిరుపతి నుంచి వచ్చిన సదరు యాక్టర్ ఇటీవల షూటింగులో పాల్గొన్నాడు. షూటింగు జరుగుతున్న సమయంలో ఆయనకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్ తేలింది. దీంతో ఆయనను హోంక్వారంటైన్ కు తరలించినట్లు సమాచారం. సదరు యాక్టర్ తో కాంటాక్ట్ అయిన వ్యక్తులను కూడా క్వారంటైన్ కు తరలించినట్లు నిర్వాహాకులు తెలిపారు.

ఇటీవలే కొద్దిపాటి సిబ్బందితో టీవీ సీరియల్స్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు కరోనా ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది. ఏపీలోనూ ఆయన కరోనా సోకిందా? లేదా షూటింగుల్లో పాల్గొనక కరోనా సోకిందా? అనేది తేలాల్సి ఉంది. అయితే షూటింగ్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకడంతో షూటింగును ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే షూటింగు తిరిగి కొనసాగిస్తారా? లేదా అనేది మాత్రం నిర్వాహాకులు స్పష్టం చేయలేదు.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ నేటికి షూటింగులు ప్రారంభం కాలేదు. స్టార్ హీరోహీరోయిన్లు ఇప్పుడే షూటింగుల్లో పాల్గొనేందుకు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. కరోనాపై వేచిచూసే ధోరణిలో నటీనటులు ఉండటంతో టాలీవుడ్లో ఇంకా షూటింగుల సందడి మొదలు కాలేదని తెలుస్తోంది. కాగా ఇటీవల ఓ ప్రముఖ కామెడియన్, ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్ తేలడంతో టాలీవుడ్లో కరోనా కలకలం మొదలైంది. దీంతో ఇప్పట్లో సినిమా షూటింగులు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.