Devara Fear Song: దేవర సాంగ్ లో నీ డామినేషన్ ఏంటయ్యా..?

రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన "ఫియర్ సాంగ్" తో మరోసారి దేవర అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందో ఆడియెన్స్ కి తెలిసిలా చెప్పారు.

Written By: Gopi, Updated On : May 21, 2024 12:28 pm

anirudh devara fear song

Follow us on

Devara Fear Song: జూనియర్ ఎన్టీయార్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ తో ఒక్కసారిగా మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెంచేశారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన “ఫియర్ సాంగ్” తో మరోసారి దేవర అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందో ఆడియెన్స్ కి తెలిసిలా చెప్పారు.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సాంగ్ లో ఎన్టీయార్ విజువల్స్ కంటే కూడా అనిరుధ్ విజువల్స్ ఎక్కువగా వేశారు. హీరో ఎన్టీఆర్ అనుకుంటున్నారా, లేదంటే అనిరుధ్ అనుకుంటున్నారా అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు రచ్చ చేస్తున్నారు. నిజానికి ఈ సాంగ్ ను కనక మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ వీడియోలు కొన్ని మాత్రమే వేస్తే అనిరుధ్ వి మాత్రం గ్రాఫికల్ తో కూడిన షాట్స్ ని చాలా హై రేంజ్ లో చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇదంతా చూసిన ఎన్టీఆర్ అభిమానులు మా ఎన్టీఆర్ అన్న సినిమాలో నీ డామినేషన్ ఏంటి అబ్బాయ్ అంటూ అనిరుధ్ పైన కామెంట్లైతే చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ అంత హైలీ క్వాలిటీగా అయితే లేదని విక్రమ్, జైలర్, లియో సినిమాలకు ఎలాంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడో ఆ రేంజ్ లో ఈ మ్యూజిక్ ని ఇవ్వలేకపోయాడని చాలామంది సినీ విమర్శకులు సైతం విమర్శలైతే చేస్తున్నారు. ఇక మరికొందరైతే చాలా ఎక్కువ డబ్బులు పెట్టి అనిరుధ్ ను ఏరికోరి మరి తీసుకున్నారు. ఆయన కంటే దేవిశ్రీప్రసాద్ ను తీసుకొని ఉంటే ఇంతకన్నా మంచి మ్యూజిక్ ఇచ్చి ఉండేవాడు కదా అంటూ ఆయన మీద కామెంట్లు చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే మిగతా సాంగ్స్ గాని, సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ గాని ఎలా ఉందో తెలిస్తే అనిరుధ్ విషయంలో అందరూ సరైన క్లారిటీ కి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కనక బాగా లేకపోతే మాత్రం ఆయన మీద విపరీతమైన స్థాయిలో ట్రోలింగ్స్ చేస్తారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…