Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ (Student Number One) సినిమాతో విజయాల బాట పట్టిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు…గత పది సంవత్సరాల నుంచి వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించిన ఏకైక హీరో కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పుడు ‘వార్ 2’ సినిమాతో మరో సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక దీంతో పాటు ప్రశాంత్ నీల్ (Prahsnth Neel) డైరెక్షన్ లో చేస్తున్న డ్రాగన్ (Dragon) సినిమా మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండువేల కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమాను చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు చాలామందికి ఇన్స్పిరేషన్ గా మారాడు.
Also Read : తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి!
ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు సైతం జూనియర్ ఎన్టీఆర్ ను చూసే మేము హీరోలుగా మారామని చెబుతూ ఉండటం విశేషం… అందులో నాగశౌర్య, విశ్వక్ సేన్ లాంటి హీరోలు ఉండటం విశేషం… వీళ్లిద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అని చాలా సందర్భాల్లో తెలియజేశారు. ఆయన నటన అంటే వాళ్లకు చాలా ఇష్టమని తెలియజేశారు…
మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి గర్వకారణమనే చెప్పాలి… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
గత సంవత్సరం దేవర(Devara) సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇక మీదట రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించాలని చూస్తున్నాడు. ఇక దేవర 2 (Devara 2) సినిమా కూడా ఉంటుందని రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది అనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోయాడు.
Also Read : ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?