Jr. NTR
Jr NTR : చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ని ఆయన అభిమానులు ఒక ఈవెంట్ లో చూసే అవకాశం దక్కింది. మ్యాడ్ స్క్వేర్(Mad Square) చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ని హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరిపించారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అభిమానుల్లో కరెంటుని నింపే స్పీచ్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘చాలా కాలం తర్వాత వంశీ కారణంగా మీ అందరినీ ఇలా కలుసుకునే అవకాశం దక్కింది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటించారు. మిగిలిన ముగ్గురు హీరోలు ఏమి అనుకోకండి, ఈ సినిమాకు శంకర్ లేకపోతే సినిమానే లేదు అనిపించింది. అతని అమాయకత్వపు నటన చాలా బాగుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : ‘పెద్ది’ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ వదిలేసుకోవడానికి కారణం ఇదేనా?
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘రామ్ నితిన్ కూడా చాలా బాగా నటించాడు. కామెడీ చేయడం అంటే చాలా కష్టం. నేను అందుకే అదుర్స్ 2 చేయడానికి భయపడుతున్నాను, ఈ అబ్బాయిలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. చాలా అద్భుతమైన భవిష్యత్తు ఇతనికి ఉంటుంది. ఇక మా బామ్మర్ది నార్నే నితిన్ గురించి చెప్పాల్సి వస్తే, నేను ప్రణతి ని పెళ్లి చేసుకునేటప్పుడు వీడు చాలా చిన్న పిల్లవాడు. ఇంట్లో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. నేను ఎప్పుడొచ్చినా లోపలకు వెళ్లి దాక్కునేవాడు. కానీ వాడు చాలా కాలం తర్వాత నాతో ధైర్యం గా మాట్లాడుతూ చెప్పిన ఒకే ఒక్క మాట, నేను సినిమాల్లోకి వెళ్తున్నాను అని చెప్పడం. సరే వెళ్ళు, కానీ నేను మాత్రం సపోర్ట్ చేయను అని చెప్పాను. ఎలాంటి సలహాలు కూడా ఇచ్చేవాడిని కాదు. వాడి సొంత ఆలోచనలతో ఇలా వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు వెళ్తుండడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘దేవర 2’ గురించి మాట్లాడుతూ ‘గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రాన్ని మీ భుజాల పై మోసి సూపర్ హిట్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా మంది ‘దేవర 2′ ఉండదని అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు, కచ్చితంగా దేవర 2 ఉంటుంది. కానీ కాస్త బ్రేక్ ఇచ్చాను, మధ్యలో ప్రశాంత్ నీల్ గారి సినిమా ఉంది కాబట్టి. ఎప్పుడూ చెప్పేదే ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరెప్పుడు కాలర్ ఎగరేసుకునే సినిమాలే తీస్తాను అని మాట ఇస్తున్నాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ మాట్లాడుతున్నంతసేపు అభిమానులు సీఎం, సీఎం అంటూ ఆడిటోరియం ని దద్దరిల్లిపోయేలా చేశారు.
Also Read : అడవుల్లోకి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు..అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ అప్డేట్!