Johnny Master : ఒక సాధారణ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని మొదలుపెట్టి, అతి తక్కువ సమయంలోనే స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగి, తన అద్భుతమైన టాలెంట్ తో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ స్టేటస్ ని దక్కించుకొని, క్షణ కాలం తీరిక లేకుండా గడిపే రేంజ్ కి ఎదిగి, నేషనల్ అవార్డుని సైతం సొంతం చేసుకున్న వ్యక్తి జానీ మాస్టర్. ఆయన ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికి ఆదర్శమే. ఎప్పుడో పవన్ కళ్యాణ్ ‘జానీ’ సినిమా సమయంలో ఇండస్ట్రీ లోకి వచ్చాడు. ఇండస్ట్రీ లో ఒక కొరియోగ్రాఫర్ అయ్యేందుకు ఆయనకీ 2012 వరకు ఆగాల్సి వచ్చింది. రామ్ చరణ్ రచ్చ సినిమాతో మొదలైన అన్నీ మాస్టర్ కొరియోగ్రఫీ జీవితం ఇప్పుడు ఈ రేంజ్ కి వచ్చింది. అయితే ఈ ఏడాది ఆయనపై లైంగిక వేధింపుల కేసు మీద అరెస్ట్ అవ్వడం, ఆ పై వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్లడం, సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు మొత్తం సర్వనాశనం అవ్వడం వంటివి జరిగాయి.
ఇప్పుడు ఆయన మళ్ళీ సున్నా నుండి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే బైలు నుండి బయటకి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ కి కెరీర్ ని ఇచ్చిన రామ్ చరణ్, మరోసారి తనకి కెరీర్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చెయ్యలేదని రామ్ చరణ్ బలంగా నమ్ముతున్నాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జానీ మాస్టర్ ని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘బెయిల్ నుండి బయటకి రాగానే రామ్ చరణ్ మీతో మాట్లాడారా?’ అని అడగగా, దానికి జానీ మాస్టర్ సమాధానం చెప్తూ ‘రామ్ చరణ్ గారు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. నేను ఉన్నాను నీ వెంట, ముందు నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఫామ్ లోకి రా, ఆ తర్వాత నీ ఆరోగ్యం సరిగా చూసుకో, బుచ్చి బాబు తో సినిమా చేస్తున్నాను. పాటలన్ని నువ్వే కంపోజ్ చెయ్యాలి అని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్.
అయితే జానీ మాస్టర్ పై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయ్యిందని, అలాంటి వ్యక్తికి రామ్ చరణ్ అవకాశం ఇస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది దురాభిమానుల రామ్ చరణ్ పై మండిపడుతున్నారు. జానీ మాస్టర్ పై కేసు నమోదు అయిన విషయం వాస్తవమే, కానీ అతను తప్పు చేసాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పోలీసులు కేవలం ఆయన్ని రిమాండ్ లో మాత్రమే ఉంచారు. కస్టడీ లోకి తీసుకోలేదు, జానీ మాస్టర్ తప్పు చేసాడు అనేది రుజువు అవ్వలేదు. పైగా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి చూస్తే కేసు వేసిన అమ్మాయి కూడా జానీ మాస్టర్ తో గత సంవత్సరం వరకు చాలా మంచిగా ఉన్నింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమెనే కేసు వేసింది. అంటే ఆమె కావాలని కూడా చేసి ఉండొచ్చు కదా?, నాణ్యం రెండు వైపులా నుండి చూసినప్పుడే సమన్యాయం జరుగుతుంది, కోర్టు ఎవరి తప్పు ఉంది అనేది తెలుస్తుంది. అప్పటి వరకు జానీ మాస్టర్ పై నమ్మకం ఉంచినోళ్లు ఉంచొచ్చు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు చెప్తున్న మాట.