Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో భారీ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్న పుష్ప 2 సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఇక పుష్ప 2 సినిమా పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా తెలుగు సినిమా హీరోల స్టార్ డమ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించింది అనేది యావత్ ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. ఇక బాహుబలి 2 సినిమాతో ప్రభాస్ క్రియేట్ చేసిన ప్రభంజనాన్ని కొనసాగిస్తు ఈ సినిమా చాలా రికార్డులను తిరగరాస్తు ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కేసు విషయంలోనే ఆయన గత 20 రోజుల నుంచి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నాడు…ఇక ఎట్టకేలకు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఆ తొక్కిసలాట కి తనకు ఏ సంబంధం లేదు అంటూ కొన్ని మాటలైతే చెప్పాడు. ఇక దానికి తగ్గట్టుగానే అధికారులు సైతం ఆ కేసులో అల్లు అర్జున్ ది తప్పు అంటూ కొన్ని వీడియోలైతే రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఇలాంటి ఒక హీట్ మూమెంట్ నడుస్తున్నప్పుడు పుష్ప 2 సినిమా నుంచి ‘దమ్ముంటే పట్టుకోరా షకవత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు’ అంటూ పుష్ప రాజ్ బన్వర్ సింగ్ షేకావత్ తో చెప్పిన డైలాగుని ఇప్పుడు రిలీజ్ చేశారు…
ఇక రేవతి కేసులో అల్లు అర్జున్ తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికి పోలీసులు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ పాట పోలీసోళ్లకు ఇన్ డైరెక్ట్ గా తగిలే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షేకావత్ కూడా పోలీసు… ఇప్పుడు ఇక్కడ కూడా పోలీసులు అల్లు అర్జున్ ని దోషిగా నిలబెట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఇలాంటి సందర్భంలో పోలీసులను రెచ్చగొట్టడానికి తప్ప వీడియోని ఎందుకు రిలీజ్ చేశారు అంటూ అల్లు అర్జున్ అభిమానులు సైతం భారీ స్థాయిలో పుష్ప 2 టీమ్ పైన తీవ్రమైన విమర్శలైతే చేస్తున్నారు… మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోను రిలీజ్ చేయడం పట్ల చాలామంది సినిమా మేధావులు సైతం పుష్ప 2 టీమ్ ను తప్పు పడుతున్నారు…