Junior NTR : బాలీవుడ్ సినీ నటులకు, అక్కడి ఆడియన్స్ కి మొదటి నుండి మన సౌత్ ఇండియన్ సినిమాలంటే చిన్న చూపు అనే విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాలలో వాళ్ళు మన టాలీవుడ్ స్టార్స్ పై నోరు జారారు. రీసెంట్ గా ఆ జాబితాలోకి జాన్వీ కపూర్ తండ్రి, శ్రీ దేవి భర్త బోణీ కపూర్ కూడా చేరిపోయాడు. ప్రముఖ యంగ్ నిర్మాత నాగ వంశీ బోణీ కపూర్ ని ఒక ప్రశ్న అడుగుతూ, ‘మా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొత్త డైరెక్టర్, కొత్త హీరో కలిసి ఒక మంచి సినిమాని అందిస్తే ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. అలాంటి పరిస్థితులు మీ బాలీవుడ్ లో ఉన్నాయా?’ అని అంటాడు. దానికి బోణీ కపూర్ సమాధానం చెప్తూ ‘ఉన్నాయి కదా.. ఉదాహరణగా ఇప్పుడు ఆదిత్య చోప్రా లాంటి పెద్ద నిర్మాత జూనియర్ ఎన్టీఆర్ లాంటి కొత్త నటుడితో సినిమా చేస్తున్నాడు’ అని అంటాడు.
దానికి హీరో సిద్దార్థ్ వెంటనే స్పందిస్తూ ‘సార్..జూనియర్ ఎన్టీఆర్ సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్..హృతిక్ రోషన్ నార్త్ లో సూపర్ స్టార్. మేము అడిగిన దానికి, మీరు చెప్పిన సమాధానం కి ఎలాంటి పొంతన లేదు’ అంటూ మండిపడ్డాడు. సౌత్ ఇండియా కి సంబంధించిన కొందరు, నార్త్ ఇండియా కి సంబంధించిన మరికొందరు ప్రముఖులు రీసెంట్ గానే ఒక చిన్న డిబేట్ ఇంటర్వ్యూ లో పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇవన్నీ చర్చల్లోకి వచ్చాయి. మన సౌత్ తరుపున సిద్దార్థ్, నాగవంశీ హాజరయ్యారు. బాలీవుడ్ తరుపున బోణీ కపూర్ తదితరులు వచ్చారు. అయితే ఈ డిబేట్ లో నాగ వంశీ బోణీ కపూర్ లాంటి సీనియర్ నిర్మాతకు అసలు గౌరవం ఇవ్వలేదని, చాలా పొగరుగా మాట్లాడాడని, ఇది సరైన పద్దతి కాదంటూ సోషల్ మీడియా లో బాలీవుడ్ ప్రముఖులు విరుచుకుపడ్డారు. దీనికి నాగ వంశీ కూడా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆయన మాట్లాడుతూ ‘ఎవరితో ఎలా మాట్లాడాలో మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. మేమంతా చాలా స్నేహపూర్వక వాతావరణం లో చర్చించుకున్నాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను, బోణీ కపూర్ గారు ఆప్యాయంగా కౌగలించుకున్నాము. రెండు మూడు సందర్భాలు చూసి నిర్ణయానికి రావడం ఇప్పటికైనా మానుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు బోణీ కపూర్ పై సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మీ అమ్మాయికి సూపర్ హిట్ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్. మీ అమ్మాయి జాన్వీ కపూర్ నటించిన సినిమా హీరో ఎవరో కూడా మీకు తెలియదా?, కొత్త హీరో అంటున్నారు అంటూ బోణీ కపూర్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. అలా సరదాగా సాగాల్సిన ఈ డిబేట్ కార్యక్రమం, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చూడాలి.