Bachchala Malli : గత కొంతకాలం నుండి ప్రముఖ హీరో అల్లరి నరేష్ కి ఏ రేంజ్ లో బ్యాడ్ టైం నడుస్తుందో మన కళ్లారా చూస్తున్నాం. ఒకప్పుడు ఆడియన్స్ లో అల్లరి నరేష్ సినిమా కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలి అనే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. కానీ అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇప్పటి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తియ్యకపోతే మెగాస్టార్ చిరంజీవి లాంటోళ్లను కూడా లెక్క చేయడంలేదు. ఇక అల్లరి నరేష్ ఎంత చెప్పండి. ఈ సత్యాన్ని గ్రహించాడు కాబట్టే తన కామెడీ జానర్ సినిమాలను పక్కన పెట్టి, కొత్త రకం కాన్సెప్ట్స్ తో మన ముందుకు వస్తున్నాడు. ఆయన ఎంచుకుంటున్న స్టోరీ భిన్నంగానే ఉంటున్నాయి. నటన కూడా అల్లరినరేష్ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. కానీ స్క్రీన్ ప్లే దెబ్బ పడుతుండడంతో ఆయన చేస్తున్న సినిమాలన్నీ కమర్షియల్ గా ఫ్లాప్ అవుతున్నాయి.
రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘బచ్చల మల్లి’ అనే చిత్రం విడుదలైంది. అన్ని సినిమాలకు లాగానే ఈ చిత్రానికి కూడా అల్లరి నరేష్ ఎంతో కష్టపడి చేసాడు. డిఫరెంట్ పాత్రతో ఆడియన్స్ ని అలరించేందుకు తన వంతు ప్రయత్నం చాలానే చేసాడు. కానీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసారు. విడుదలకు ముందు ఈ సినిమాకి దాదాపుగా 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విడుదల తర్వాత కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఆడియన్స్ కనీస స్థాయిలో కూడా ఈ చిత్రం పై ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. ఓటీటీ లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రానికి అంతంత మాత్రం రెస్పాన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ఎంతో కష్టపడ్డారు. కేవలం ప్రొమోషన్స్ కోసమే రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసారు. కనీసం ఆ ప్రొమోషన్స్ ఖర్చులు అయినా ఈ చిత్రం రీకవర్ చేసి ఉంటే బాగుండేది. పాపం అల్లరి నరేష్ బ్యాడ్ లక్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నేచురల్ స్టార్ నాని కూడా వచ్చాడు. ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆడియన్స్ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. కొత్త తరహా సినిమాలు అల్లరి నరేష్ కి అసలు వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే ఆయన అభిమానులు మళ్ళీ పాత ట్రాక్ లోకి రావాలంటూ కోరుకుంటున్నారు. త్వరలోనే ఆయన ‘సుడిగాడు 2 ‘ మూవీ ని ప్రారంభించబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ చిత్రాలను కలిపి స్పూఫ్ గా ఈ చిత్రం ఉండబోతుంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన భీమినేని శ్రీనివాస రావు, రెండవ భాగానికి కూడా దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది.