JD Chakravarthy- NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి ఇండస్ట్రీ లో కథలు కథలు గా చెప్పుకుంటారు. అంత ర్యాష్ డ్రైవింగ్ బహుశా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా చెయ్యదు. తన అన్నయ్య జానకి రామ్., అలాగే తండ్రి తండ్రి నందమూరి హరికృష్ణ ఇద్దరూ కూడా దురదృష్టంకొద్ది కారు యాక్సిడెంట్ కారణంగానే చనిపోయారు. అప్పటి నుండీ జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతీ సినిమాలో ప్రారంభానికి ముందే కార్ ప్రయాణం అప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యండి అని చెప్పుకుంటూ వచ్చేవాడు.
తన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా అక్కడికి వచ్చిన అభిమానులందరికీ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళండి, ర్యాష్ డ్రైవింగ్ లాంటివి వద్దు అని పదే పదే చెప్పేవాడు. ఇదంతా కుటుంబం లో ఇద్దరు ప్రేమించిన వాళ్ళు పోయిన తర్వాత ఎన్టీఆర్ లో మార్పు వచ్చింది. కానీ ఒకప్పుడు మాత్రం ఎన్టీఆర్ డ్రైవింగ్ చాలా భయానకంగా ఉండేదట.
ప్రముఖ సీనియర్ మోస్ట్ హీరో జేడీ చక్రవర్తి ఎన్టీఆర్ ర్యాష్ డ్రైవింగ్ గురించి గతం లో ఒకసారి మాట్లాడాడు, మళ్ళీ ఇన్నాళ్లకు మరోసారి ఎన్టీఆర్ ర్యాష్ డ్రైవింగ్ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దయ అతి త్వరలోనే డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సందర్భంగా, ఆయన రీసెంట్ గా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూస్ లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ తో నేను మెహదీపట్నం నుండి కార్ లో వస్తున్నాను. తనకి నా సినిమాల్లో ‘గులాబీ’ చిత్రం నుండి మేఘాలలో తేలిపొమ్మన్నది అనే పాట బాగా ఇష్టమట.
ఆ పాటని కార్ లో పెద్ద వాల్యూం పెట్టి 120 స్పీడ్ లో వెళ్ళాడు. ఆ సమయం లో ఆయన అన్నయ్య ఇప్పుడు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటాది అంటావ్ అని అన్నాడు. అప్పుడు నేను కళ్ళు మూసుకుంటే మన ఇద్దరం శాశ్వతంగా కళ్ళు మూసుకోవాలి ఏమో జాగ్రత్త తారక్ అని చెప్పాను, ఆరోజు కళ్ళు అక్కడక్కడా తెరిచే తోలి ఉంటాడు, లేకపోతే నేను ఈరోజు చనిపోయి ఉండేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు జేడీ చక్రవర్తి.