Jayasudha: కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నటులు కరోనా బారిన పడి, కోలుకోగా.. సహజనటి జయసుధ తాజాగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండి ఆమె చికిత్స పొందుతుండగా.. త్వరగా ఆమె కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నారు. అయితే, జయసుధ కరోనాతో ఆస్పత్రి పాలైంది అనగానే ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆమెకు కరోనా సోకింది అనే విషయాన్ని జయసుధ టీమ్ స్వయంగా వెల్లడిస్తూ.. జయసుధ గారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా వచ్చింది అని, ప్రస్తుతం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు అని తెలియజేసారు. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి’ అని జయసుధ తన అభిమానులను కోరారు. మొత్తానికి జయసుధ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్.
Also Read: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపెవరిది?
జయసుధ కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి జయసుధ కరోనా విషయంలో మొదటి నుంచి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలా ప్రముఖులు కూడా కరోనా పాజిటివ్ రావడం షాకింగ్ విషయమే. అయితే, జయసుధకి తేలికపాటి జ్వరంతో పాటు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట.

అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ బారిన పడుతున్న సెలబ్రిటీల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఏది ఏమైనా జయసుధ పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలియగానే బాధ పడుతున్నారు.
Also Read: మహిళా కానిస్టేబుళ్లకు జెంట్స్ టైలర్ తో కొలతలా?
[…] […]